💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న "సూర్యభగవానుడు"
⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹🙏
💥ధ్యానం:
ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ
నారాయణ: సరసిజాసన సన్నివిష్ట: |
కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ
హరీ హిరణ్మయువు: దృత శంఖచక్ర: ||
🌹భావం:
శంఖ చక్రములను ధరించి, స్ప్రుహణీయమైన దివ్య మంగళ విగ్రహంతో, కేయూరములు, మకర కుండలములు, హారములు, కిరీటము కలిగి యుండి సూర్య మండల మధ్యమున ప్రకాశించుచున్న శ్రీమన్నారాయణుని ధ్యానించవలెను...
🍁🍁🍁🍁🍁
💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న "సూర్యభగవానుడు"
ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా.
చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు.
"సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ"-🌹 అని శ్రుతివాక్యం.
లోకాల మనుగడకు, పోషణకు, సర్వజీవులకు సూర్యుడే ఆధారం.
ఆయన వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడుతున్నది.
"ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ,
నారాయణ సరసిజాసన సన్నివిష్టః"-🌹
అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, వానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది.
"ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్
కుర్వన్ బ్రహ్మణో విద్వాన్ సకలం భద్రమశ్నుతే"-🌹
ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి అని శ్లోక భావం.
సంధ్యా సమయంలో సూర్యుడికి ఎదురుగా కూర్చొని, కండ్లు మూసుకొని, సూర్యుడిలోని శక్తిని ధ్యానించడమే సంధ్యోపాసన (సూర్య ఉపాసన)
ఈ ఉపాసన వల్ల మహర్షి విశ్వామిత్రుడు సృష్టికి ప్రతిసృష్టి చేయగలిగాడు.
పూర్వకాలం ఋషులంతా సంధ్యోపాసన వల్ల దీర్ఘాయువును పొందారని పెద్దలు చెప్తారు.
యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః॥-🌹 (భగవద్గీత)
"ఏ పరమేశ్వర శక్తి వల్ల అన్ని భూతాలకు ప్రవృత్తి కలుగుతున్నదో, ఏదైతే ఈ జగత్తు అంతా వ్యాపించి ఉన్నదో, ఆ పరమేశ్వర తత్వాన్ని మానవుడు తనదైన కర్మతో పూజించి సిద్ధి పొందుతాడు" అని భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు పేర్కొన్నాడు.
అంటే ఎవరైనా తమకు విధించిన కర్మలను ఆచరిస్తూ, భగవంతుడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి.
"కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్ శతగుం సమాః"🌹
ఈ లోకంలో కర్మలను ఆచరిస్తూనే నూరేండ్లు జీవించి ఉండాలని కోరుకోవాలని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తున్నది.
💥వేదోక్తమైన నిత్య కర్మానుష్ఠానాల్లో "సూర్యోపాసన", సూర్యుడిలోని తేజోమయ పుంజమైన "గాయత్రీ ఉపాసన" చాలా ముఖ్యమైనది.
భారతీయ విజ్ఞానానికి మూలం గాయత్రి.
దీనిని సంధ్యా అనీ, సావిత్రీ అనీ, సరస్వతీ అనీ పిలుస్తారు.
"సంధౌ భవాక్రియా సంధ్యా"-🌹
సంధి కాలంలో చేసే క్రియ సంధ్యా వందనం.
దివారాత్రులకు సంధిలో ఆరాధించే దేవత సంధ్యా.
సూర్యోదయ, సూర్యాస్తమయ కాలంలో విధిగా మనుషులంతా చేయదగిన ఉపాసన సంధ్యోపాసనే.
"అహరహః సంధ్యాముపాసితా"-🌹
ప్రతిరోజూ సంధ్యను ఉపాసించాలని అని వేదం చెప్తున్నది.
కాల స్వరూపుడైన సూర్యభగవానుడి ఆరాధనమే "సంధ్యోపాసన"
కర్మకు శ్రద్ధ జీవం.
అందుకే కర్మలను విధి విధానంగా ఆచరించి కర్మల శుభ ఫలాలను పొందవచ్చు.
అందుకే ప్రతి ఒక్కరూ ఉదయం, సాయంత్రం సంధ్యా సమయాల్లో సూర్యుడిలోని తేజోపుంజాన్ని ఉపాసించి, తేజస్సును, మేధస్సును, ఆరోగ్యాన్ని పొందుదురు గాక.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment