శ్రీరామచంద్రుడు వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.
⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏
💥నవ్యాతి నవ్యం రామనామ ధ్యానామృతం...
ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం..
ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం..
అదే "శ్రీమద్రామాయణ" గాథ.
శ్రీరామచంద్రుడు వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.
ధర్మగుణం, కృతజ్ఞతా భావం ఆభరణాలుగా కలిగిన ఆయనను వాల్మీకి మౌని
"ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’, ‘రామో విగ్రహవాన్ ధర్మః" అని అభివర్ణించారు.
‘రామ+అయనం’ అంటే ‘రాముని మార్గం’ అని అర్థం.
అంటే, ఎదురైన సమస్యలను రాముడు ఎలా అధిగమించాడో తెలుసుకుని అనుసరించగలిగేదని పెద్దలు చెబుతారు.
అంత విశిష్టమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యాన్ని మాతృకగా తీసుకొని ఎందరో కవులు వివిధ కోణాలలో ఆవిష్కరించారు.
రామచరితంపై ఇన్ని గ్రంథాలు అవసరమా? అన్న సందేహాలకు
‘మరల నిదేల రామాయణం బన్న
ఈ ప్రపంచమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న దెపుడును, తనరుచి బ్రతుకులు తనవికాన,
చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనూభూతి తనదికాన,
తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’
అని "రామాయణ కల్పవృక్షం" కర్త కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యానించారు.
🍁🍁🍁🍁🍁
💥శ్రీరాముడు అఖండ భరతావనికి నిత్య ఆరాధ్యనీయుడు, ఆదర్శపురుషుడు.
త్యాగ, ధర్మాలను బోధించి, ఆచరించి నిరూపించిన మానవోత్తముడు.
హరిహర అద్వైత స్వరూపుడు రాముడు.
అష్టాక్షరిలోని ప్రాణప్రదమైన ‘రా’, పంచాక్షరిలోని జీవ ప్రధానమైన ‘మ’తో ‘రామ’ శబ్దం ఏర్పడి యుగయుగాలుగా, తరతరాలుగా అలరిస్తోంది.
"వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే/
వేదః ప్రాచేతసా దాసీత్ సాక్షాద్రామాయణాత్మనా"🌹
వేదాలలో తెలియదగిన పరమాత్మ దశరథ తనయుడిగా అవతరించగా, వేదం వాల్మీకి ద్వారా రామాయణంగా అవతరించింది.. అని ఆర్య వాక్కు.
💥"రాముని వలె ప్రవర్తించు… రావణుని వలె ప్రవర్తించకు" అని చెబుతారు.
లోకం రాముడిని దేవుడిగా భావించినప్పటికీ ఆయన మానవతీత శక్తులను, మహిమలను, మాయలను ఎక్కడ ప్రదర్శించలేదు.
ఉత్తమ మానవుడిగానే మనుగడ సాగించాడు.
అందుకే ‘పురుషోత్తముడి’ గా వినుతికెక్కాడు.
💥మర్యాదరాముడు:
కొందరిలో దయాగుణం, మరికొందరిలో వీరత్వం, ఇంకొందరిలో జ్ఞానం.. ఇలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుణం ఉండవచ్చు.
కానీ సత్యం, ధర్మం, దయ, క్షమ, ఓరిమి, వినయం, ఔదార్యం, అభిమానం ఎన్నో సుగుణాల రాశి రామభద్రుడు.
అందుకే ఆయన ‘#సుగుణాభిరాముడు’గా వినుతికెక్కాడు.
💥కృతజ్ఞతాభిరాముడు:
ఇతరుల నుంచి వంద అపకారాలు ఎదురైనా పట్టించుకోని శ్రీరాముడు, ఎవరి వల్ల ఏ చిన్న ఉపకారం పొందినా ఎంతో సంతుష్టి చెంది, కృతజ్ఞత చాటేవాడట.
సీతాపహరణంతో దారీ తెన్నూ తెలియక ఆరాటపడుతున్న సోదర లక్ష్మణ సమేత రాముడికి శబరి ఆతిథ్యం ఇచ్చి, హనుమ సుగ్రీవుల గురించి చెబుతుంది.
ఆ మాట సాయానికే ఆర్ద్రుడైన ఆయన, ‘దిక్కుతోచక పరితపిస్తున్న మాకు దిశానిర్దేశం చేసిన నీవు చల్లని నదీ మతల్లివై మానవళిని తరింపచేస్తావు’ అని వరమిచ్చాడు.
అది ఆయనకు గల కృతజ్ఞతా భావానికి నిదర్శనం.
సీతాపహరణ సమయంలో రావణుడిని ఎదిరించి నేలకూలిన జటాయువును చూసి దుఃఖంతో చలించిపోయాడు.
‘సీతాపహరణం కంటే జటాయువు నా కోసం మరణించడమే ఎంతో బాధ కలిగిస్తోంది లక్ష్మణా!’ అని విలపించి, ఆ పక్షి పట్ల కృతజ్ఞతా భావంతో అంతిమ సంస్కారం నిర్వహించాడు.
సీతామాత క్షేమ సమాచారాన్ని తెలిపిన హనుమతో "నీవు నాకు గొప్ప మేలు చేశావు.
నీవు చేసిన సహాయానికి నేను ఏ విధంగా ప్రత్యుపకారం చేయగలను? అయినా నా సర్వస్వం అనదగిన గాఢాలింగనాన్ని అందిస్తున్నాను, స్వీకరించు"
(ఏష సర్వస్వభూతో మే పరిష్వంగో హనూమతః) అంటూ హనుమను ఆలింగనం చేసుకున్నాడు.
🔹🔸🔹🔸🔹
ఆపత్కాలంలో కూడా ఒక అడుగయినా వెనుకాడకుండా ధైర్యంతో నియమంతో ఉండే రూపమే ధర్మం. ఆ ధర్మ స్వరూపమే రామావతారం.
సాక్షాత్ రామ చంద్రమూర్తినే లక్ష్యంగా పెట్టుకొన్న రామ మంత్ర జపపరాయణులకు కామం, మోహం మొదలయిన మకిలమేదీ మనస్సు కంటదు.
అట్టివారు ధర్మమార్గం వదలిపోరు.
"రామ"నామం చిత్తమాలిన్యం పోగొట్టి వేరొక దానిమీద ఆశ కలుగనీయక సదా ఆనందంగా ఉండేటటుల చేస్తుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment