Posts

💥కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం 💥 ఎంతో పవిత్రంగా భావించే "కార్తీక మాసం" ప్రారంభమైంది. ఉత్తరాయణంలో మాఘ మాసం, దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసంగా పేరు వచ్చింది. శివకేశవ ప్రియం.. కార్తీకం..! ఆధ్మాత్మిక వెల్లివిరిసే నెల. కార్తీక మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు.  శ్రీమహావిష్ణువుకు సమానదేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు.. అని పురాణ వచనం. పురాణాల ప్రకారం, విష్ణువు ఈ మాసంలో నారాయణ రూపంలో నీటిలో ఉంటాడు. ఇది పుణ్యస్నానాలకు, వివిధ వ్రతములకు అత్యంత శుభప్రదమైనది. ఈ నెలలో ఒంటిపూట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించటం ఎంతో పుణ్యప్రదమని, అలా దీపాలు వెలిగించలేని వారు.. ఆరిన దీపాలు వెలిగించినా, దీపాలు ఆరిపోకుండా చేతి అడ్డుగా పెట్టినా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం, బిల్వపత్రాలతో శివుని అర్చన, అభిష...

💥శ్రీమహాలక్ష్మీ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥శ్రీమహాలక్ష్మీ స్తోత్రం💥 జయ పద్మ విశాలాక్షి జయత్వం శ్రీపతిప్రియే / జయ మాత ర్మహలక్ష్మి సంసారార్ణవ తారిణీ // మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరీ / హరిప్రియే నమస్తుభ్యం దయానిధే // పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే / సర్వభూత హితార్థాయ వసువృష్టిం సదాకురు // జగన్నాత ర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే / దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోస్తుతే // నమః క్షీరార్ణవసుతే నమ స్తైలోక్యధారిణీ / వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ // రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే / దరిద్రం త్రామిహం లక్ష్మీ కృపాం కురు మయోపరి // సమస్త్రైలోక్య జననీ నమ స్తుభ్యం జగద్దితే / అర్తిహంత్రి నమ స్తుభ్యం సమృద్దిం కురు మే సదా // అబ్జవాసే నమ స్తుభ్యం చపలాయై నమో నమః / చంచలాయై నమ స్తుభ్యం లలితాయై నమో నమః // నమః ప్రద్యుమ్న జననీ మాతస్తుభ్యం నమో నమః / పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ // శరణ్యే త్వాం ప్రసన్నో 2 స్మి కమలే కమలాలయే / త్రాహి త్రాహి మహాలక్ష్మి పరిత్రాణ పరాయణే // పాండిత్యం శోభతే నైవ నశోభంతి గుణా కరే / శీలత్వం నైవ శోభతే మహాలక్ష్మీ త్వయా వినా // తావ ద్విరాజతే...

ఆశ్వయుజ అమావాస్య.. దీపావళి

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 ఆశ్వయుజ అమావాస్య.. దీపావళి భారతీయ సంప్రదాయంలో దీపం 🪔 దైవస్వరూపం. జ్ఞానానికి సంకేతం. ఆనందానికి ప్రతీక. అందుకే దీపాన్ని లక్ష్మీరూపంగా భావిస్తారు. ఆ తల్లి కటాక్షం కోసం దీపాన్ని వెలిగిస్తారు. దీపాలు మనలో నెలకొని ఉన్న చీకట్లను చీలుస్తాయి. అజ్ఞాన అంధకారాన్ని పరిమార్చుతాయి. జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తాయి. జీవితంలో వెలుగు-నీడలు సహజం. చికాకులే చీకట్లు. సత్ప్రవర్తనతో మెలగడమే వెలుగు. చీకటి నరకం.. వెలుగు స్వర్గం.. నరకుడు చీకటి.. ఆ చీకటిని చిదిమేసిన కాంతిపుంజం సత్యభామ! ఆ వెలుగులు విరజిమ్మిన రోజు లోకానికి దీపావళి. 💥🪔🪔#దీపావళి🪔🪔💥 నరకాసురుడిది గొప్ప జన్మ. హిర్యణ్యాక్షుడి నుంచి భూదేవిని రక్షించిన ఆది వరాహమూర్తి ఆ తల్లికి అనుగ్రహించిన వరం అతడు. వరాహ తేజస్సును కోట్ల సంవత్సరాలు గర్భంలో మోసింది భూదేవి. సత్యయుగంలో గర్భం దాలిస్తే.. త్రేతాయుగంలో కాన్పు అయింది. ఆసురీ లక్షణాలతో పుట్టాడు బిడ్డ. కొడుకు ఆలనాపాలనా జనక మహారాజుకు అప్పగించింది భూదేవి. జనకుడు తన కొడుకుతో సమానంగా నరకుడినీ పెంచాడు. తానే బలవంతుడిననే గర్వం నరకుడిని కుదురుగా ఉండనివ్వలేదు. కుర్రాడి ఆగడా...

ఆశ్వయుజ బహుళ చతుర్దశి.. నరక చతుర్థశీ

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 ఆశ్వయుజ బహుళ చతుర్దశి.. నరక చతుర్థశీ  "నరక చతుర్దశి" ఆచరణ వెనక ఉన్న గాథల్లో నరకాసురుడి గాథ ప్రధానమైంది. హిరణ్యాక్షుడు లోకానికి ఉపద్రవంగా భూదేవిని చుట్టచుట్టి సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి వరాహావతారమెత్తి, ఆ రాక్షసుని సంహరించి భూదేవిని ఉద్ధరించాడు. ఆ సందర్భంగా భూదేవికి విష్ణుమూర్తి వరప్రసాదం వలన భీముడనే పుత్రుడు జన్మించాడు. అతనే దుర్మార్గుడైన నరకాసురునిగా పేరొందాడు.  నరకుడు ప్రాగ్జోతిషపురం అను రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. భూమాత తన కుమారుని రాక్షసత్వానికి దూరం గానే పెంచింది. దురదృష్టవశాత్తు నరకుడు అసుర ప్రభావంలో పడి ఘోరతపస్సు చేసి అనేక వరాలు పొందాడు. తనకు తన తల్లి చేతిలో తప్ప మరణం సంభవించకూడదని కూడా వరం పొందాడు. స్వయాన తన తల్లే తనను చంపదని అతని ధీమా. ఆ వరగర్వంతో అతను కావించిన దుష్కార్యాలు పరాకాష్టకు చేరి దేవతలను తీవ్ర అశాంతికి గురి చేసాయి. విష్ణు ద్వేషియై దేవతలను హింసించసాగాడు. దేవమాత అదితి కర్ణ ఆభరణాలను, వరుణ ఛత్రాన్ని అపహరిస్తే శ్రీకృష్ణుడు ఇతనిని ద్వందయుద్ధంలో ఓడించి, వాటిని తిరిగి అదితికి అందజేసాడు. మరొకప్పుడు మదపుటే...

అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్... 🌹 షడాననాష్టకం🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🌹🙏 శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం🌹🙏 💥 అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్...    🌹 షడాననాష్టకం🌹🙏 అగస్త్య ఉవాచ నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ । షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ || 1 || నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ । దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య || 2 || అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ । అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ || 3 || నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ । హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే || 4 || తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ । సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః || 5 || నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే । బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ || 6 || మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ । నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే || 7 || సర్వస...

ఆశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన్వంతరీ త్రయోదశి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 ఆశ్వయుజ బహుళ త్రయోదశి.. ధన్వంతరీ త్రయోదశి. ఈ పండుగకు యమ త్రయోదశి, కుబేర త్రయోదశి, ఐశ్వర్య త్రయోదశి వంటి పేర్లు ఉన్నాయి. ఆరోగ్యప్రాప్తి, ఐశ్వర్య సిద్ధి కోసం దైవ స్వరూపాల్ని విశేషంగా ఆరాధించే పర్వదినమే ధన త్రయోదశి. "అందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలి. అకాల మత్యు భయాలు లేకుండా, సిరి సంపదలతో విలసిల్లాలి" అనే శుభాకాంక్షలకు నేపథ్యమే ధనత్రయోదశి పర్వదినం. సంపదలతో తులతూగడానికి లక్ష్మీదేవినీ, సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరినీ, సుస్థిర ఆర్థిక వృద్ధికి కుబేరుణ్నీ, అపమృత్యు బాధలు తొలగడానికి యమధర్మరాజును వివిధ రీతుల్లో ధన త్రయోదశినాడు పూజిస్తారు. ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి, బలిపాడ్యమి, యమద్వితీయ అనే అయిదు పండుగల సమాహారానికి ధన త్రయోదశి శుభశ్రీకారం చుడుతుంది. 💥"ధన త్రయోదశి"కి పౌరాణిక ప్రశస్తి ఎంతో ఉంది. లక్ష్మీదేవిని నరక చెర నుంచి విముక్తి చేసి, శ్రీహరి ఆమెను ధనాధిష్ఠాన దేవతగా ప్రకటించి, ధనలక్ష్మి పేరిట ఐశ్వర్యానికి పట్టాభిషిక్తురాల్ని చేసింది ఈ రోజేనని చెబుతారు. అలాగే వామనుడు త్రివిక్రమావతారాన్ని ధరించి బలిచక్రవర్తి వ...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 హరిః ఓం నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః "న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్” -- అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే “కార్తీకమాసానికి సమానమైన మాసము లేదు. శ్రీమహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం. కార్తీకమాస మహత్యం గురించి పూర్వం నైమిశారణ్య ఆశ్రమములో శౌనకాది మహామునులు అందరికీ సూతమహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రలు, విష్ణు మహిమలను వినిపించే సమయంలో, "ఓ సూతముని శ్రేష్ఠా! కలియుగంలో ప్రజలు సంసార సాగరమునుండి తరింపలేక, అరిషడ్వర్గాలకు దాసులై, సుఖంగా మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతిబాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది? దేవతలు అందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమ దైవమెవరు? మానవునికి ఆవరించియున్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం యిచ్చే కార్యమేది? ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగిం...