ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏

 

బాలసుబ్రహ్మణ్యం_భజేఽహం భక్తకల్పభూరుహం శ్రీ

నీలకంఠ హృదానందకరం నిత్య శుద్ధ బుద్ధ ముక్తాంబరమ్


వేలాయుధధరం సుందరం వేదాంతార్థబోధ చతురం

ఫాలాక్ష గురుగుహావతారం పరాశక్తిసుకుమారం ధీరమ్


పాలిత గీర్వాణాది సమూహం పఙ్చభూతమయ మాయామోహం

నీలకంఠ వాహం సుదేహం నిరతిశయానంద ప్రవాహమ్


🌹భావం:


బాలసుబ్రహ్మణ్యా!! భక్తుల కోర్కెలను తీర్చడంలో కల్పవృక్షము వంటి వాడా, నిన్ను నేను భజిస్తున్నాను. నీలకంఠుడికి అనగా పరమశివునికి ఆనందము కలిగించు వాడా!!


వేలాయుధా! అనగా శక్తి శూలమును చేతిలో ధరించినవాడా! వేదాంతార్ధములను బోధించుటలో చతురత కలిగిన వాడా!! ప్రణవార్ధమును ఫాలాక్షుడికి (తండ్రికే) వివరించిన వాడు కదా మన పాలబుగ్గల, పార్వతీ స్వరూపుడు.. బాల సుబ్రహ్మణ్యుడు!


పరాశక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ముద్దుల కొడుకు, ధీరత్వం కలిగినవాడు, బ్రహ్మాది దేవతలందరినీ పాలించువాడు (దేవసేనాపతి), పంచభూతములతో కూడిన మాయను సృష్ఠించినవాడా! (మహామాయినే నమః అని స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో వస్తుంది..)


నెమలిని వాహనముగా కలిగిన వాడా!! సుందరమైన రూపము కలవాడా!! నిరయతిశయ ఆనంద స్వరూపమా! ఓ బాల సుబ్రహ్మణ్యా నిన్ను భజిస్తున్నాను.


💥స్వామినాథ స్వామి


అందరికీ స్వామి అయిన శివునికి సుబ్రహ్మణ్యస్వామి ప్రణవ మంత్రం ‘ఓం’ తత్వాన్ని వెల్లడించిన కారణంగా సుబ్రహ్మణ్య స్వామి వారిని "స్వామినాథ స్వామి" అని కొలుస్తారు.


స్వామినాథ అంటే గురు స్వరూపం. అసలు స్వామి అనే మాట అమరకోశం ప్రకారం ఒక్క సుబ్రహ్మణ్యుడిదే.


ఎందుచేతనంటే “దేవసేనాపతీ, శూరః, స్వామీ, గజముఖానుజః “ అని అర్ధంగా ఇవ్వబడింది. 


తరువాత స్వామి అనే పేరు వేరే స్వరూపాలు కూడా తీసుకున్నా, అన్నీ సుబ్రహ్మణ్య స్వరూపాలే అని అనుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని పిలిచినా, కేవలం స్వామీ అని పిలిచినా అది సుబ్రహ్మణ్యుడికే చెందుతుంది అని చెప్పింది అమరకోశం.


ఒకానొక సమయంలో సుబ్రహ్మణ్య స్వామి వారు, పరమశివునికి ప్రణవము ఉపదేశం చేశారు స్వామిగా.

ఇది ఎంతో చిత్రంగా ఉంటుంది... శంకరుడు సకల జ్ఞానములకు ఆలవాలము.


"ఈశానః సర్వ విద్యానాం" అంటారు కదా.

ఇక్కడ దీని అంతరార్ధము ఏమిటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకు చేతిలో ఓడిపోవడం ఇష్టపడతాడు.


కొడుకు చేతిలో తండ్రి ఓడిపోతే అది తనకి గొప్ప సన్మానముగా భావిస్తాడు తండ్రి.


లోకానికంతటికీ జ్ఞానమునిచ్చే తండ్రికి, తన తేజస్సుతో పుట్టిన పుత్రుడు జ్ఞాన బోధ చేయడం అనేది ఎంతో ఆనందదాయకమైన విషయము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం