⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే🌹🙏
⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే🌹🙏 దక్షిణామూర్తి స్వరూపము యొక్క భావమును మనం పరిశీలించినట్లయితే ఈ క్రింది విషయములు మనకి బోధపడతాయి... విశాలమైన వట (మర్రి) వృక్షము – విశాలంగా విస్తరించే ఆ పరమాత్ముని సృష్టిని సూచిస్తుంది. వట వృక్ష మూలంలో కూర్చొని ఉన్న దక్షిణామూర్తి, ఈ సర్వ సృష్టికి ఆధారభూతుడని సూచిస్తున్నది. ఇక ఆయన స్వరూపము అష్టమూర్తి తత్త్వముతో కూడినది. అనగా పంచ భూతములు, సూర్య, చంద్రులు, పురుషుడు/ఆత్మ/యజమాని. కుడిచేతిలో ఉన్న ఢమరుకము - ఆకాశ తత్త్వము- శబ్ద బ్రహ్మ స్వరూపుడైన ఈశ్వరుడు జటాజూటములు - వాయుతత్త్వము ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – అగ్ని తత్త్వము తలపైన ఉన్న గంగ – జల తత్త్వము మూర్తీభవించిన దక్షిణామూర్తి రూపము – పృథివి తత్త్వము. శిరస్సుకిరువైపులాఉన్న సూర్య చంద్రులు – సూర్య చంద్రులు ధ్యానం/మౌనంలో ఆయన స్వరూపము – యజమాని/పురుషుడు/ఆత్మ ఈ రూపంలో ఉన్న దక్షిణామూర్తి సృష్టి, స్థితి, లయ కారుడైన పరమేశ్వరుడుగా గోచరిస్తాడు. కుడిచేతిలో ఉన్న ఢమరుకము సృష్టికారకత్వాన్ని తెలియజేస్తుంది. మద్యలో ఉన్న సూర్య చంద్రులు స్థితికారకత్వాన్ని తెలియజేస్తుంది. ఎడమ చేతిలో ఉన్న అగ్ని/జ్యోతి – లయకారకత్వాన్ని ...