🔱🌹ఓం మహాకాలాయ నమః🌹🔱

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱

💥🌼💥🌼💥🌼💥


💥అకాల మృత్యు రక్షణకు..


🔱🌹ఓం మహాకాలాయ నమః🌹🔱


అవంతికాయాం విహితావతారం, ముక్తి ప్రదానాయచ సజ్జనానాం!

అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం!!


ఈ శ్లోకం ద్వారా ఉజ్జయినిలో ఉన్న మహా కాళుడికి నమస్కారం చేస్తున్నాము.

🍁🍁🍁🍁🍁


మన భూమే మనకున్న శివలింగం.

శివలింగ ఆరాధన అంటే భూమికి చేసే పూజనే. 


అందుకే మహాకాల ఆరాధన అంతా తన చుట్టూ తాను తిరిగి కాలాన్ని మనకు సూచించే భూమికి మాత్రమే.


అంతేకాదు, కాలం తీరినవాడు మళ్ళీ ఈ భూమిలోకే చేరుకోవాలి.

అందుకే, ‘కాలుడు’ అంటే శివుడు.

గణించే కాలానికి అధిపతి శివుడు (భూమి)


అదే విధంగా ఈ కాలానికి రూపం ఉండకపోవడం వల్ల కాల శబ్దం నలుపునకు కూడా సంకేతంగా ఉపయోగించబడింది.


ఉజ్జయిని ప్రాంతంలో గతంలో ఈ కాలానికి సంబంధించిన ముఖ్యమైన లెక్కలన్నీ జరగడం వల్ల అక్కడి స్వామి మహాకాలుడు, అమ్మవారు మహాకాళిగా మనకు దర్శనమిస్తూ అకాల మృత్యువు కలుగకుండా అభయాన్నిస్తున్నారు.


కాలం యొక్క లక్షణాన్ని తెలుసుకొని ‘కాలుని’లో ‘కాలగర్భం’లో కలిసిపోక ముందే సకాలంలో అనేక కర్మవిహితమైన కార్యక్రమాలు పూర్తి చేయడమే ‘కాలోపాసన’


అకాలంలో విత్తిన పంటలు పండనట్లు, అకాలంలో చేసిన కర్మలకూ రూపం ఏర్పడక ఇబ్బంది పడతారు. చివరకు కాలుని వశమవుతారు.


ప్రతి నిమిషాన్ని కాలునిలో లగ్నం చేసిన వారు కాలాతీతులుగా మారి శరీరం మృతమైనా వారు అమృతమయులవుతారు.


అందుకే, కాలం సద్వినియోగం కావాలన్నా, అకాల ప్రమాదాలు ఏవీ జరుగకుండా ఉండాలన్నా ‘కాలోపాసన’ చేయాలి.


💥"ఓం మహాకాలాయ నమః" అనే జపం చేస్తూ ఉండడం వల్ల కాల సహకారంతో అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు