💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి
⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి'
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ:
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్ర మకల్మషం
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధం!
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే
నమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః!!
ఈశ్వరుడు ఒక్కో యుగంలో ఒక్కో మహాగురువుగా అవతరించాడు. కృతయుగంలో దక్షిణామూర్తిగా, త్రేతాయుగంలో దత్తాత్రేయుడిగా...
కానీ రాబోయే కలియుగాన్ని, అందులో మానవుల కష్టనష్టాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భగవానుడే ద్వాపరయుగాంతంలో "వేదవ్యాస మహర్షి"గా అవతరించారు.
వ్యాసుడు సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడు.
వేదాలను గ్రంధస్థం చేయుటయే కాక, అనేక మన్వంతరాలు, కల్పాలు, ఇతర సృష్టిలో జరిగిన సంఘటనలు, వాటిలో ఉన్న ధర్మసూక్ష్మాలను మానవాళికి అందించి, వారి ఉద్ధతి కోసం 18 పురాణాలను, 18 ఉపపురాణాలను రచించారు. బ్రహ్మసూత్రాలను అందించారు.
తాను బ్రహ్మనిష్ఠుడై ఉండీ, బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నప్పటికి, మానవాళి మీద ప్రేమతో క్రిందకు దిగి వచ్చి ఈ రచనలు చేశారు.
అంత మేలు చేసిన వ్యాసునికి కృతజ్ఞత ఆవిష్కరించడం కోసమే వ్యాసజయంతిని "వ్యాసపూర్ణిమ"గా, "గురు పూర్ణిమ"గా జరుపుకుంటాం.
వేద వ్యాసుడు పరాశర మహర్షికి, సత్యవతికి కృష్ణ వర్ణం అనగా నల్ల రంగుతో ఒక ద్వీపంలో జన్మించాడు.. కనుక “కృష్ణ ద్వైపాయనుడు” అని పిలవబడ్డాడు.
శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ ద్వైపాయనుడు వ్యాసుడు. విష్ణుతేజంతో జన్మించిన ఈ మహనీయుని సాక్షాత్తు శ్రీమహావిష్ణు అవతారంగా భావిస్తారు.
అందుకే శ్రీ విష్ణుసహస్రనామం పీఠికలో “వ్యాసాయ విష్ణు రూపాయ – వ్యాస రూపాయ విష్ణవే” అని తలచుకుంటారు.
సమస్త వాఙ్మయం "#వ్యాస_ఉచ్చిష్టమ్" అంటారు పెద్దలు. అంటే ఎవరు ఏ వాఙ్మయాన్ని చెప్పిన అది వ్యాసులవారు ఏది చెప్పారో దాని నుంచే చెప్పబడింది తప్ప వేరుగా ఏది లేదు అని. అంత గొప్ప వాఙ్మయాన్ని ఇచ్చారు.
మనకి ఇంతటి భక్తి, జ్ఞాన బోధనలు చేసి, గురు పరంపరను తీస్కొని వచ్చి సనాతన ధర్మాన్ని ప్రచారంగావించిన అటువంటి మహాపురుషుడికి "గురుపౌర్ణమి" రోజున పూజ చేసుకోవడం మన అదృష్టం.
"శ్రీమన్నారాయణుడి" అంశావతారమైన వ్యాస మహర్షులవారిని గురు పౌర్ణమి రోజున కేవలం స్మరించినంత మాత్రాన మన పాపరాశి దగ్దమైపోతుంది.
ఈ రోజున, దక్షిణా మూర్తి గురుభగవానుడిని, వ్యాస మహర్షి, దత్తాత్రేయుడిని పూజించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.
శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యకృతౌ వందే భగవంతౌపునః పునః
వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి. అంతే కాదు, విష్ణు అవతారంగా భావించే వ్యాసుడ్ని పూజించి విష్ణుపురాణం దానమివ్వడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవడంతో పాటు శుభఫలితాలు కలుగుతాయి.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment