💥ఆషాఢమాస విశిష్టత:

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥ఆషాఢమాస విశిష్టత:


తెలుగు ప్రజలు అనుసరించే చాంద్రమానం ప్రకారం, ఆషాఢ మాసము సంవత్సరంలో నాలుగవ నెల.


ఈ నెలలో పౌర్ణమి రోజు చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రం తో కలసి వస్తాడు కనుక ఈ నెలకు ఆషాఢ మాసం అని పేరు వచ్చింది.


ఈ మాసంతో మనదేశంలో వర్షఋతువు ప్రారంభమవుతుంది. గ్రామీణ ప్రజానీకమంతా వ్యవసాయ సంబంధమైన కార్యక్రమాలలో నిమగ్నమవుతుంది. 


ఆషాఢ మాసాన్ని శూన్యమాసంగా ప్రరిగణిస్తారు, వ్యక్తిగత శుభకార్యాలు ఏవి జరుపుకోరు.


కానీ దేవాలయాలలో మరియు గ్రామ దేవతల ఉత్సవాలు జరుపుతారు. నాలుగు నెలల చాతుర్మాస్య వ్రతం ఈ ఆషాఢ మాసం నుండే ప్రారంభమవుతుంది. బ్రాహ్మణులు ఈ సమయాన్ని ప్రత్యేకించి వేదాధ్యయనానికి వినియోగించుకుంటారు.


ఆషాఢ మాసంలో నవ దంపతులు, అత్తా కోడళ్ళు ఒకరికొకరు దూరంగా ఉంటారు. ఈ మాసంలో స్త్రీలు ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకుంటారు.


ఆహారంలో మునగకాయను విరివిగా వాడటం, పేలపిండిని తినడం  మంచిదని భావిస్తారు.


ఈ ఏడాది ఆషాడ మాసం జూలై 6 వ తేదీన ప్రారంభమై.. ఆగష్టు 4 వ తేదీన ముగుస్తుంది.


💥ఈ మాసంలో వచ్చే పండగలు:


ఆషాఢ శుద్ధ విదియ - జగన్నాథస్వామి రథయాత్ర 

ఆషాఢ శుద్ధ ఏకాదశి - తొలి ఏకాదశి, చాతుర్మాస్య వ్రత ప్రారంభం 

ఆషాఢ పూర్ణిమ - వ్యాస భగవానుని జయంతి - గురుపూర్ణిమ

ఆషాఢ బహుళ చతుర్థి - సంకటహర చతుర్థి 

ఆషాఢ బహుళ ఏకాదశి - కామ ఏకాదశి 

ఆషాఢ బహుళ చతుర్దశి - మాస శివరాత్రి 


తొలి ఏకాదశికి ప్రథమ ఏకాదశి, శయన ఏకాదశి, మతత్రయ ఏకాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి.


ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహీ అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని.. గుహ్య నవరాత్రులని కూడా పిలుస్తుంటారు.


ఈసారి వారాహీ నవరాత్రులు.. ఆషాడ మాస ప్రారంభం నుండి అనగా... జులై 6 శనివారం 2024న ప్రారంభమై జులై 15 సోమవారం 2024న ముగుస్తాయి.


ఈ మాసం లో చేసే స్నానం, దానం, జపం, పారాయణలు, విశేష ఫలితాన్నిస్తాయి.


ఆషాడ మాసంలో చేసే సముద్ర నదీ స్నానాలు ముక్తిదాయకం అని.. చెప్పులు, గొడుగు, ఉప్పు దానం చేయడం విశిష్ట ఫలితం ఇస్తుందని విశ్వాసం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి