🔥జ్వాలాతోరణం🔥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔥జ్వాలాతోరణం🔥
మ్రింగెడిది గరళమని తెలిసి
మ్రింగెడివాడు ప్రాణవిభుడని, మేలని ప్రజకున్
మ్రింగుమనె సర్వ మంగళ
మంగళసూత్రమ్మునెంత మది నమ్మినదో
(కవి, శ్రీనాథుడు వ్రాసిన పద్యం)
💥దేవతలు, రాక్షసులు అమృతము కోసము సముద్రాన్ని చిలికినప్పుడు మొదటగా "హాలాహలం" ఉద్భవించినది.
ఇది లోకములను సర్వ నాశనము చేసే ప్రమాదము ఉన్నందున, బ్రహ్మాదులు ఈ ఉత్పాతం నుంచి రక్షించ వలసినదని మహాశివుని ప్రార్థించారు.
వారి ప్రార్థనను మన్నించి, మహాశివుడు ఆ హాలాహలాన్ని మ్రింగటానికి సిద్ధపడ్డాడు.
ఆ హాలాహలం బయట ఉంటే పై లోకాలను, కడుపు లోనికి వెడితే అధో లోకాలను దహించివేస్తుందనే ఉద్దేశంతో మహాశివుడు ఆ విషాన్ని కంఠ మధ్యములో నిక్షేపించాడు.
ఈ దృశ్యాన్ని చూసి, పార్వతీ దేవి తన భర్తకు ప్రమాదం వాటిల్లుతుందని భయపడి, శివునికి ప్రమాద నివారణ కోసం ప్రతి సంవత్సరము అగ్ని జ్వాల క్రింది నుంచి తన భర్తతో సహా దూరి వెడతానని మ్రొక్కుకుంది.
కనుక ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ పౌర్ణమి నాటి రాత్రి శివాలయములలో, ఎండు గడ్డితో చేసిన తోరణమును, రెండు కర్ర స్తంభముల మధ్య కట్టి, దానికి అగ్నిని ముట్టించి, ఆ తోరణము జ్వాలగా వెలుగుతుంటే,
ఆ జ్వాల క్రింది నుంచి శివ, పార్వతుల పల్లకీని మూడు సార్లు మోసుకొని వెడతారు. జ్వాల వలె వెలిగే ఈ తోరణాన్ని "#జ్వాలా_తోరణము" అంటారు.
💥శివ కేశవ భేదం లేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే "జ్వాలతోరణ" దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి.
జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి.
కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి. కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలా తోరణం.
దీనికి "#యమద్వారం" అని పేరు కూడా వుంది.
💥మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం వుంది.
యమలోకం లోకి వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తీ ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాలి. వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష.
ఈ శిక్షను తప్పించుకోవాలంటే.. ఈశ్వరుడిని ప్రార్థించాలి.
అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమ ద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్లి వస్తారో వారికి ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.
అతనికి యమ ద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు. అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి.
జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే, శివా.. నేను ఇప్పటి దాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తానని ప్రతిజ్ఞ చేయాలి.
జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకొచ్చి.. ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెడతారు. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్ర భూతాలు ఇంటిలోకి రావని విశ్వాసం.
సేకరణ...💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment