Posts

Showing posts from November, 2024

కార్తికపురాణము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తికపురాణము - పదవఅధ్యాయము 💥 జనకుడు తిరిగి ఇట్లు అడిగెను. ఓ మునీశ్వరా! ఈ అజామిళుడు పూర్వజన్మమందెవ్వడు? ఏమిపాపమును జేసెను? విష్ణుదూతలు చెప్పినమాటలను విని యమభటులు ఎందుకు యూరకుండిరి? యముని వద్దకుపోయి యమునితో ఏమని చెప్పిరి? వశిష్ఠుడు ఇట్లు చెప్పెను. యమదూతలు విష్ణుదూతలమాటలు విని శీఘ్రముగా యమునివద్దకుబోయి సర్వవృత్తాంతమును జెప్పిరి. అయ్యా! పాపాత్ముడును, దురాచారుడును, నిందితకర్మలను ఆచరించువాడునునగు అజామిళునికి తోడితెచ్చుటకు పోయినంతలో విష్ణుదూతలు వచ్చి మమ్ములను ధిక్కరించి అతనిని విడిపించిరి. మేము వారిని ధిక్కరించుటకు అశక్తులమై వచ్చితిమి అని చెప్పిరి. ఆమాటను విని కోపించి యముడు జ్ఞానదృష్టితో చూచి యిట్లనియె. ఈఅజామిళుడు దుర్మార్గుడైనను అంత్యకాలమందు హరినామము చేయుటచేత పాపములు నశించి వైకుంఠప్రియుడాయెను. అందువలన అతనిని విష్ణుదూతలు స్వీకరించిరి. దుష్టాత్ములై మహిమను తెలిసికొనక హరినామస్మరణ చేసినను జ్పాపములు నశించును. తెలియక తాకినను అగ్ని కాల్చునుగదా! భక్తితో నారాయణ స్మరణనుజేయువాడుజ్ జీవన్ముక్తుడై అంతమందు మోక్షమునొందును. యముడిట్లు విచారించి యూరకుండెను. అజామిళుడు పూర్వ జ...

కార్తీకపురాణము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తీకపురాణము- తొమ్మిదవఅధ్యాయము💥 విష్ణుదూతలడిగిరి.ఓ యమదూతలారా! మీ ప్రభువు మీతో చెప్పిన మాటలేమిటి? మీయమదండనకు ఎవ్వడు తగినవాడు? పుణ్యమనగా ఏమి? ఈవిషయములన్నిటిని మాకు చెప్పమని విష్ణుదూతలడుగగా యమదూతలు ఓ విష్ణుదూతలారా! సావధానముగా వినుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, వాయువు, ఆకాశము, గోవులు, సంధ్యలు, పగలు, దిక్కులు, కాలము ఇవి మనుష్యుని పుణ్యపాపములను గురించి సాక్షులు. మేము వీరి సాక్ష్యముతో విచారించి పాపములను చేసిన వానిని దండింతుము. వేదమార్గమును వదలి ఇచ్ఛానుసారముగా తిరుగుచు, వేదశాస్త్రములను దూషించుచు సాధు బహిష్కృతుడైన వానిని మేము దండింతుము. బ్రాహ్మణుని, గురువును, రోగిని పాదములచేత తన్నువాడును, తల్లిదండ్రులతో కలహించువాడును అయిన వారిని, నిత్యము అబద్ధమాడుచు జంతువులను జంపుచు కులాచారములను వదిలినవారిని, ఇచ్చిన సొమ్మును తిరిగి తీసుకున్నవానిని, డాంబికుని, దయాశాంతులు లేనివానిని భార్యతో క్రీడించువానిని, ద్రవ్యమును గ్రహించి సాక్ష్యములను చెప్పువానిని మేము దండింతుము. నేను దాతనని చెప్పుకొనువానిని, మిత్రద్రోహిని, ఉపకారమును మరచిన వానిని అపకారమును చేయువానిని మేము దండింతుము.వివాహమ...

💥ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే 'గోపాష్టమి'

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సురభ్యై నమః🌹🙏 💥 ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించే 'గోపాష్టమి ' నమోగోభ్యః శ్రీమతీభ్యః సౌరాభేయీభ్య ఏవచ నమో బ్రహ్మనుతాభ్యశ్చ పవిత్రాభ్యో నమోనమః || గావోమమాగ్రతః సంతుగావోమే సంతుపృష్టతః గావోమే హృదయే నిత్యంగవాం మధ్యే వసామ్యహం||   సర్వదేవమయేదేవి సర్వ దేవైరలంకృతే మాతర్నమాభిలషితం సఫలంకురువందిని|| 💥హిందూ సంప్రదాయంలో గోమాతకు విశిష్ట స్థానముంది. కార్తిక శుద్ధ పాడ్యమి రోజు శ్రీకృష్ణుడు ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షం నుంచి గోకులాన్ని రక్షించడానికి గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుపై ఎత్తి గొడుగులా పట్టి గోకులాన్ని రక్షిస్తాడు. మొత్తం ఏడు పగళ్లు ఏడు రాత్రులు భీకరంగా రాళ్ల వర్షాన్ని కురిపించిన ఇంద్రుడు చివరకు శ్రీకృష్ణ పరమాత్మ ముందు తన అహంకారాన్ని విడిచిపెట్టి శరణు వేడుతాడు. ఇంద్రుడు శరణు వేడిన "కార్తిక శుద్ధ అష్టమి" రోజునే గోపాష్టమిగా జరుపుకుంటాం. గోవు పరదేవతా స్వరూపము. గోవులకు అధిష్ఠాన దేవత సురభీదేవి. కామధేనువు పరాశక్తియైన లక్ష్మీస్వరూపం.  ఆవులో 33 కోట్ల దేవతలు కొలువైవుంటారు. గోవుకే 'మాత' అనే హోదాను ఇచ్చారు. అలాంటి అమ్మలాంటి గోమాతను పూజించే వారి...

కార్తీకపురాణము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తీకపురాణము - ఎనిమిదవఅధ్యాయము 💥 వశిష్ట మునీంద్రా!నా మనస్సులో గొప్ప సందేహము కలిగినది.ఆ సందేహమును తెలిపెదను,దానిని నశింపజేయుము. మీరు నాకు ధర్మసూక్ష్మమును చెప్పితిరి.పాతకములలో గొప్పవానిని చెప్పినారు. వర్ణ సంకరకారకములైన మహాపాపములు చేసిన దుర్జనులు వేదత్రయోక్తములయిన ప్రాయశ్చిత్తములను జేసికొని పరిశుద్ధులగుదురని ధర్మశాస్త్రములందు చెప్పబడియుండగా మీరు ధర్మలేశముచేతనే పరిశుద్ధులై విష్ణులోకమును పొందుదురని చెప్పినారు.అది ఎట్లు సంభవమగును?ఓ మునీశ్వరా! అనంత పాతకములు చేసి, ఈ పాపములు గొప్పవనియు వీటికి ప్రాయశ్చిత్తములు చేయించుకొనవలెననియు తెలిసియు అట్లు చేయక దైవవశముచేత సంభవించి కార్తీకదీపదానాది పుణ్యముల వలన వైకుంఠమునకు పోవుట ఎట్లు సంభవించును? వజ్రపర్వతమును గోటికొన చివరిభాగముచేత చూర్ణము చేయసాధ్యమా? స్వయముగా గొప్ప పర్వతమునెక్కి అక్కడనుండి క్రిందకిపడుతూ మధ్యనున్న చిన్నతీగను పట్టుకున్న యెడల పడకుండునా?ఇట్టి దృష్టాంతములనుబట్టి చూడగా అధికములయిన పాపములను చేసి స్వల్పపుణ్యము చేత వాటిని నశింపచేయుట ఎట్లు శక్యమగును?నాకీ సంశయమును నశింపజేయుము.నాకే కాదు, వినువారికందరికిని ఇది ఆశ్చర్యక...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏

కార్తీకపురాణం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥కార్తీకపురాణం - సప్తమఅధ్యాయము💥 వశిష్ఠుడిట్లనెను. ఓ జనకమహారాజా! కార్తీక మహాత్మ్యమును యింకా చెప్పదను సావధాన మనస్కుడవై వినుము. ఈమాసమందు ఎవడు పద్మములచేత పద్మములవంటి నేత్రములు గల హరిని పూజించునో వాని యింటిలో పద్మములందుండు లక్ష్మీదేవి నిత్యనివాసము చేయును. భక్తితో తులసీదళముతోను, జాజిపువ్వులతోను హరిని పూజించువాడు తిరిగి భూమియందు జన్మించడు. మారేడు దళములతో సర్వ వ్యాపకుడయిన హరిని పూజించినవాడు తిరిగి భూమియందు జన్మించడు. భక్తిో ఫలములను దానమిచ్చువాని పాపములు సూర్యోదయముకాగానే చీకట్లు ఎట్లునశించునో అట్లు నశించును. ఉసిరికాయలతో ఉసిరి చెట్టుక్రింద హరిని పూజించువానిని యముడు చూచుటకు కూడా సమర్థుడు కాడు. కార్తీకమాసమందు తులసీదళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును. ఇందుకు సందేహములేదు. కార్తీకమాసమందు బ్రాహ్మణులతో గూడా వనభోజనము ఆచరించువానియొక్క కోటానుకోట్ల పాపాలు నశించును. బ్రాహ్మణులతో గూడా ఉసిరి చెట్టు దగ్గర సాలగ్ామమును పూజించువాడు వైకుంఠమునకు పోయి అచ్చట విష్ణువు వలె ఆనందించుచుండును. భక్తిచే హరియొక్క ఆలయమందు మామిడి చిగురులలో తోరణమును గట్టువాడు పరమపదము పొందును. హరికి అరటి స...

⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

కార్తికపురాణము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🌹 💥కార్తికపురాణము - ఆరవఅధ్యాయము💥 వశిష్ఠుడు మరల ఇట్లనెను ఓ జనకమహారాజా! కార్తీకమాసమందు భక్తితో మాసమంతయు హరికి కస్తూరితోను, గంధముతోను, పంచామృతములతోను, స్నానము చేయించువాడు పదివేల అశ్వమేధయాగముల ఫలమును బొంది తుదకు పరమపదమును పొందును. సాయంకాలమున హరిసన్నిధిలో దీపదానము ఆచరించువారు విష్ణులోకమును బొందుదురు. ఈమాసమందు దీపదానము చేసిన వారు జ్ఞానమును పొంది విష్ణులోకమును పొందుదురు. ప్రత్తిని చక్కగా ధూళిలేకుండా విడదీసి, వత్తిని చేసి, బియ్యపుపిండితోగాని, గోధుమపిండితో గాని పాత్రను చేసి గోఘృతమును పోసి వత్తిని తడిపి వెలిగించి వేదబ్రాహ్మణునికి పూజించి ఇవ్వవలెను.ఇట్లు మాసమంతయు చేసి అంతమందు వెండితో పాత్రను జేయించి, బంగారముతో వత్తిని చేయించి, బియ్యపు పిండిలో మధ్యగా ఉంచి పూజించి నివేదించి తరువాత బ్రాహ్మణ బోజనముగావించి తరువాత తాను స్వయముగా ఈ క్రింది మంత్రమును చెప్పుచు ఆదీపమును దానము చేయవలెను. *శ్లో!! సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపచ్ఛుభావహం! దీపదానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ!!* దీపము సర్వజ్ఞానదాయకము, సమస్త సంపత్ప్రదాయకము. కనుక నేనిప్పుడు దీపదానమును చేయుచున్నాను. దీనివల్ల నాకు నిరంతర...

💥బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు / షోడశ గణపతులు

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥బహురూప గణపతి ధ్యాన శ్లోకాలు / షోడశ గణపతులు . 🌷శ్రీ బాల గణపతి ధ్యానం: కరస్థకదలీచూతపనసేక్షుకమోదకమ్ | బాలసూర్యమిమం వందే దేవం బాలగణాధిపమ్ || 1 || ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.  🌷శ్రీ తరుణ గణపతి ధ్యానం: పాశాంకుశాపూపకపిద్థజంబూ స్వదంతశాలీక్షుమపి స్వహస్తైః | ధత్తే సదా యస్తరుణారుణాభః పాయాత్స యుష్మాం స్తరుణో గణేశః || 2 || ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు.  🌷శ్రీ భక్త గణపతి ధ్యానం: నాలికేరామ్రకదలీగుడపాయసధారిణమ్ | శరచ్చంద్రాభవపుషం భజే భక్తగణాధిపమ్ || ౩ || ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను సేవిస్తే భక్తి...

కార్తీకపురాణం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తీకపురాణం 💥 *అథ పంచమాధ్యాయ ప్రారంభః* వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పెను. ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు పాపక్షయము కొరకు పుణ్యమును చేయవలయును. పుణ్యముచేత పాపము నశించుటయేగాక పుణ్యమధికమగును. కార్తీకమందు హరిసన్నిధిలో భగవద్గీతా పారాయణమును చేయువాడు పాము కుబుసము విడచినట్లుగా పాపములను విడుచును. ఈమాసమందు తులసీ దళములతోను, తెల్లనివి, నల్లనివి అయిన అవిశపూలతో కరవీర(గన్నేరు) పూలతో హరిని పూజించినయెడల వైకుంఠమునకు బోయి హరితో గూడా సుఖించును.భగవద్గీతయందు విభూతి, విశ్వరూప సందర్శన అధ్యాయములను హరి సన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠలోకమునకు అధిపతియగును. హరిసన్నిధిలో శ్లోకముగాని, శ్లోక పాదముగాని, పురాణము చెప్పిన వారును, విన్నవారును కర్మబంధ విముక్తులగుదురు. కార్తీకమాసమందు శుక్లపక్షమందు వనభోజనము చేయువారికి సమస్త పాపములు నశించును. ఇతర కాలములలో జపకాలమందు, హోమకాలమందు, పూజాకాలమందు, భోజనకాలమందు, తర్పణకాలమందు, చండాలురయొక్కయు, పాపాత్ములయొక్కయు, శూద్రులయొక్కయు, అశౌచవంతులయొక్కయు సంభాషణలను వినినచో దోషపరిహారము కొరకు కార్తీకమాసమునందు వనభోజనము ఆచరించవలయును. అనేక జాతి వృక్షములతో గూడిన వ...

💥సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 💥 సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం 💥 సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా । విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥ న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యమ్ । చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ॥ 2 ॥ మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ । మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 3 ॥ యదా సంనిధానం గతా మానవా మే భవాంభోధిపారం గతాస్తే తదైవ । ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ ॥ 4 ॥ యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా- స్తథైవాపదః సంనిధౌ సేవతాం మే । ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహం తమ్ ॥ 5 ॥ గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢా- స్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః । ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు ॥ 6 ॥ మహాంభోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే । గుహాయాం వసంతం స్వభాసా లసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ ॥ 7 ॥ లసత్స్వర్ణగేహే నృణాం కామ...

💥 కార్తీక శుద్ధ చతుర్థి..🐍 నాగులచవితి

Image
 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః 🌹🙏 💥 కార్తీక శుద్ధ చతుర్థి..🐍 నాగులచవితి పుట్టలోని నాగేంద్రస్వామి లేచి రావయ్యా! గుమ్మపాలు త్రాగి వెళ్ళిపోవయ్యా! చలిమిడి వడపప్పు తెచ్చినామయ్యా! వెయ్యి దండాలయ్య, నీకు కోటి దండాలయ్యా! నన్నేలు నాగన్న నాకులమునేలు, నాకన్నవారల నాఇంటివారల ఆప్తమిత్రులనందరిని ఏలు. పడగ తొక్కిన పగవాడనుకోకు, నడుము తొక్కిన నావాడనుకొనుము. తోక తొక్కిన తొలుగుచూ పొమ్ము ఇదిగో ! నూకనిచ్చెదను మూకనిమ్ము. పిల్లల మూకను నాకిమ్ము. 💥కార్తీక శుద్ధ చవితినాడు సూర్యోదయానికి ముందు ఆకాశంలో తూర్పు దిక్కున శేషుని నక్షత్ర రూపం కనిపిస్తుంది. ఇది సర్పాకారంలో ఉంటుంది. కనుక ఈ చవితిని "నాగుల చవితి" అని పిలుస్తారు. ప్రకృతిని, అందులోని జంతువులను పూజించడం భారతీయులకు అనాదిగా వస్తున్న ఆచారం. సమస్త జీవకోటిలో ఈశ్వరుడు ఉన్నాడని విశ్వసిస్తారు. ఇందులో భాగంగానే పాములను పూజిస్తారు. నాగుల చవితి నాడు నాగేంద్రుని శివ భావముతో అర్చిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని.. పెండ్లి కావాల్సిన యువతులు నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోస్తే త్వరగా పెళ్లి అవుతుందని నమ్మకం.  సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని, గర్భ దోషాలు...

💥కార్తీకపురాణం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥కార్తీకపురాణం💥 అథ చతుర్థధ్యాయ ప్రారంభః జనకుడిట్లడిగెను. వశిష్టమునీంద్రా! నీ ఒక్క వాక్సుధా రసమును పానము చేయుచున్న నాకు తృప్తి తీరలేదు. కాన తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము. ఆకార్తీకమందు ఏదానమును జేయవలెో ల్దేనిని గోరి వ్రతము ఆచరించవలయునో చెప్పుము. వశిష్ఠుడు ఇట్లు పలికెను. పాపములను నశింప జేయునదియు, పుణ్యమును వృద్ధిబొందించునదియు అయిన కార్తీకవ్రతమును ఇంకా చెప్పెదను వినుము. కార్తీకమాసమునందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును. కార్తీకమాసమందు శివాలయంలో గోపుర ద్వారమందును, శిఖరమందును ఈశ్వర లింగ సన్నిధియందును దీపారధన చేసిన యెడల సమస్తపాపములు నశించును. ఎవ్వడు కార్తీకమాసమునందు శివాలయంలో ఆవునేతితో గాని నేతితోగాని నువ్వునూనెతో గాని విప్పనూనెతో గాని నారింజనూనెతో గాని భక్తితో దీపసమర్పణము చేయునో వాడే ధన్యుడు. వాడు ధర్మజ్ఞుడు. ధర్మాత్ముడును అగును. పూర్వోక్తములయిన నూనెలు సంభవించినచో ఆముదముతోనయినా దీపమును సమర్పించిన యెడల పుణ్యవంతుడగును. కార్తీకమాసమందు శివాలయంలో మోహముచేతగాని, బడాయికి గాని భక్తితో గానీ దీపమిచ్చువాడు శివప్రియుడగును. సందేహములేదు. పూర...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 తెలుగు పంచాంగం ప్రకారం, తెలుగు నెలల్లో ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే అన్నింటికంటే కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది.  ఈ మాసంలోని కార్తీకసోమవారం నాడు పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి, ఉపవాస వ్రతం ఆచరించి, దాన ధర్మాలు చేస్తే సకల పాపాల నుండి విముక్తి పొందొచ్చని పండితులు చెబుతారు.  కార్తీకసోమవారం అంటే శుభ ఫలితాలకు సంకేతమని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజున వివాహిత మహిళలు భక్తి శ్రద్ధలతో భోళా శంకరుడిని పూజిస్తే దీర్ఘసుమంగళి భాగ్యం లభిస్తుందని నమ్ముతారు.  అంతే కాదు సోమవారం రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేచి, ప్రవహించే నదిలో స్నానం చేసి "హర హర శంభో.. హర హర మహదేవ" అంటూ ఈశ్వరుడిని స్మరించుకుంటే కష్టాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని చాలా మంది విశ్వసిస్తారు. కార్తీక మాసంలోని సోమవారం పూట ఉపవాసం ఉండి పరమేశ్వరుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఇలా చేయడం వల్ల కైలాసవాసం దర్శనభాగ్యం కలుగుతుందని శాస్త్రాలలో వివరించబడింది. దీన్నే కార్తీక నక్తాలు అని కూడా అంటారు. సాధారణంగానే సోమవారం అంటేనే ఈశ్వరుడికి ప్రీతికరమైనది. సోమ ...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

కార్తికపురాణము

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తికపురాణము - తృతీయోధ్యాయము 💥 శ్లో!! కార్తీకేమాసి రాజేంద్ర స్నానదాన జపాదికం! లేశంవాకురుతేమర్త్యః తదక్షయ్య ఫలం స్మృతమ్!! ఓ జనకమహారాజా! వినుము. కార్తీకమాసమందు స్నానము దానము జపము మొదలయిన పుణ్యములలో ఏదయినను స్వల్పమైనా చేసిన యెడల ఆ స్వల్పమే అనంతఫలప్రదమగును. స్త్రీలుగాని, పురుషులుగాని, అస్థిరమైన శరీరమును నమ్ముకుని శరీరకష్టమునకు భయపడి కార్తీకవ్రతమును చేయని యెడల నూరుమారులు కుక్కగా పుట్టుదురు. కార్తీక పున్నమిరోజున స్నానదానములు ఉపవాసమును చేయని మనుష్యుడు కోటిమారులు చండాలుడై జన్మించును. అట్లు చండాలుడై పుట్టి చివరకు బ్రహ్మ రాక్షసుడైయుండును. ఈవిషయమందొక పూర్వకథ చెప్పెదను వినుము. ఆంధ్రదేశమందు తత్వనిష్ఠుడను ఒక బ్రాహ్మణుడు గలడు. అతడు సమస్త శాస్త్రములను చదివినవాడు, అబద్ధమాడనివాడు, ఇంద్రియములను జయించివాడు, సమస్త ప్రాణులందు దయగలవాడు, తీర్థయాత్రలయందాసక్తి గలవాడు. రాజా! ఆ బ్రాహ్మణుడు ఒకప్పుడు తీర్థయాత్రకుపోవుచు గోదావరీ తీరమందు ఆకాశమునంటియున్నట్లు ఉన్న ఒక మర్రిచెట్టు మీద ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూచెను. ఆ బ్రహ్మరాక్షసులకు తలవెంట్రుకలు పైకి నిక్కియున్నవి. నోరు వికటముగా ఉన...

కార్తీక శుద్ధ విదియ.. "భగినీహస్త భోజనం" (యమ ద్వితీయ)

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 కార్తీక శుద్ధ విదియ.. "భగినీహస్త భోజనం" (యమ  ద్వితీయ) తోబుట్టువు ఆప్యాయతా… ఓ పండగే..! ఈ రోజున సోదరి ఇంట్లో చేతి భోజనం చేసే సోదరులకు సంపూర్ణ ఆయుష్షు కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. 💥#పురాణగాధ: సూర్యుడికి ఒక కుమారుడు, ఒక కుమార్తె. వారి పేర్లు యమధర్మరాజు, అమ్మాయి పేరు యమున.  చెల్లెలికి అన్న పైన విపరీతమైన ప్రేమాభిమానాలు. ఆమె వివాహమై వెళ్ళాక తన సోదరుడిని తన ఇంటికి ఎన్నో సార్లు పిలిచింది. కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు. ఓ రోజున అర్ధాయుష్కుడైన మార్కండేయుడి ప్రాణాన్ని హస్తగతం చేసుకునేందుకు యముడు పాశాలతో వెళ్తాడు. అప్పుడు ఆ బాల భక్తుడు మహాశివుణ్ని శరణు వేడుకుంటాడు. స్వామి త్రిశూలం తీసుకుని యముడి వెంటపడటంతో, ఆయన తన చెల్లెలి ఇంటికి వెళ్లి తలదాచుకుంటాడు.  ఆ కార్తీక మాస విదియ రోజున సోదరుడు వచ్చాడని యమున సంతోషంగా పిండివంటలతో భోజనం పెట్టింది. చాలా రోజుల తర్వాత సోదరీ సోదరులు కలుసుకోవటంతో ఇరువురూ సంతోషించారు. ఆ సంతోషంతో యమధర్మరాజు యమునని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆమె ఈ కార్తీకశుధ్ధ విదియనాడు లోకంలో ఎక్కడైనా సరే, తన సోదరి ఇంటికి వెళ్లి భోజనం చేసిన సోదరులక...

కార్తీకపురాణము

Image
 ⚜️🕉️🚩ఓం నమః శివాయ🌹🙏 💥 కార్తీకపురాణము -- ద్వితీయఅధ్యాయం💥 అథద్వితీయాధ్యాయ ప్రారంభః శ్రుణురాజన్ ప్రవక్ష్యామి మహాత్మ్యం కార్తీకస్యచ! కర్మత్రయ కృతాత్పాపాత్ ముచ్యతే శ్రవణాదపి!! ఓ రాజా! కార్తీకమహాత్మ్యము విన్నంతనే మనోవాక్కాయముల వలన చేయబడిన పాపమంతయు నశించును. కార్తీకమాసమందు శివప్రీతిగా సోమవార వ్రతమాచరించు వాడు కైలాసనివాసియగును. కార్తీకమాసమున సోమవారమందు స్నానముగాని, దానమును గాని, జపమును గాని చేసిన యెడల అశ్వమేధ యాగములు చేసిన ఫలమును పొందును అనుటలో సందేహములేదు. కార్తీకమాసమందు ఉపవాసము, ఒకపూట భోజనము, రాత్రి భోజనము, ఛాయానక్త భోజనము, స్నానము, తిలదానము, ఈ ఆరు ఉపవాస సమానములగునని ఋషులు చెప్పిరి. శక్తిగలవాడు కేవలము ఉపవాసము చేయవలెను. అందుకు శక్తిలేనివాడు రాత్రిభోజనమును చేయవలెను. అందుకు శక్తిలేనివాడు ఛాయానక్తము చేయవలెను. అందుకు శక్తి లేనివాడు బ్రాహ్మణులకు భోజనముపెట్టి వారితో పగలే భోజనము చేయవలెను. ఛాయానక్తమనగా సూర్యకాంతి తగ్గిన తరువాత రెట్టింపు కొలతకు తన నీడ రాగానే పగలే భుజించుట. సాయంకాలము 4 ½ గంటలకు భుజించుట ఛాయానక్తమగును. మానవులు పైన చెప్పిన ఆరింటిలో దేనినయినను ఆచరించని యెడల యెనిమిది యుగములు నరక...

⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏

కార్తీక మాసంలోని తొలిరోజు వచ్చే పండుగే "బలిపాడ్యమి"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 దీపావళి పండుగ మరునాడు.. అంటే కార్తీక మాసంలోని తొలిరోజు వచ్చే పండుగే "బలిపాడ్యమి" ఈ రోజున రాక్షసరాజు, మరణాన్ని జయించి చిరంజీవిగా నిలిచిన బలి చక్రవర్తిని పూజించటం సంప్రదాయం. మిగిలిన ప్రాంతాల కంటే ఈ పండుగ కేరళలో అత్యంత వేడుకగా జరుగుతుంది. పురాణకథనాల ప్రకారం, ప్రహ్లాదుని మనుమడే బలి చక్రవర్తి. (ప్రహ్లాదుని కుమారుడైన విరోచనుడి కుమారుడు). పరమ విష్ణుభక్తుడైన తాత ప్రహ్లాదుని ఒడిలో ఆటపాటలతో అతని బాల్యం గడవటంతో బలి చక్రవర్తికీ విష్ణుభక్తి అబ్బింది. రాక్షసులకు రాజైన కారణంగా వారినీ పాలిస్తూ ఉండేవాడు. ఈయన మహాదాత. అత్యంత జనరంజకంగా పాలన చేసేవాడు. ఈయన కాలంలో జనం సుఖసంతోషాలతో జీవించటంతో ‘నేను గొప్ప రాజును’ అనే అహంకారం అతని మనసును ఆవరించింది. దీంతో ఒక మహాయాగం చేసి ఏకంగా ఇంద్రపదవిని చేపట్టాని భావించాడు. ఈ యాగానికి ముల్లోకాలవారినీ ఆహ్వానించి, దానాలు చేసి సంతృప్తి పరుస్తాడు. అయితే.. ఇతని గర్వభంగం చేసేందుకు శ్రీ మహావిష్ణువు ఏడేళ్ల బ్రాహ్మణ బాలుడిగా, గుండు, చిన్న గొడుగు, కమండలం తీసుకుని ఆ యాగస్థలికి వస్తాడు. ఆ బాలుడిని చూసిన బలి చక్రవర్తి.. అందరిలాగే ఇతనికీ దానం ఇస్తానన...

💥కార్తీకపురాణము💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥కార్తీకపురాణము💥 ప్రథమాధ్యాయము శ్లో!! వాగీశాద్యాస్సుమనసః సర్వార్థానాముపక్రమే! యన్నత్వా కృతకృత్యాస్స్యుః తం నమామి గజాననమ్!! ఋషయ ఊచుః శ్లో!! వశిష్ఠేన విదేహాయ కథితం బ్రూహినో మునే! శ్రోతుకామావయంత్వత్తః కార్తీకవ్రతముత్తమమ్!! తా!! నైమిశారణ్యమందు సత్రయాగ దీక్షితులయిన శౌనకాది మహామునులు సూతుని ఒకప్పుడు జనకునకు వశిష్ఠ మహాముని చేత చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును సవిస్తారముగా మేము మీవలన వినగోరితిమని అడిగిరి. సూతుడు శౌనకాది సమస్తమునీశ్వరులారా! వినుడు. ఈ కార్తీకమహాత్మ్యమును వశిష్ఠమహాముని జనకమహారాజుకు చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మయు, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికి విష్ణువు చెప్పినారు. దీనివలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవారు జననమరణ రూప సంసార బంధనమును త్రెంచుకుని మోక్షము పొందుదురని ఈ విధముగా చెప్పాను. ఒకానొకప్పుడు దైవవశముచేత సిద్ధాశ్రమమునకు బోవుచు వశిష్ఠ మహాముని జనకమహారాజు గృహమునకు చేరెను. అంత జనకమహారాజు వచ్చిన వశిష్ఠుని చూచి సింహాసనమునుండి దిగి సాష్టాంగ దండ ప్రణామము చేసి సంతోష పులకాంకితుడై అర్ఘ్యపాద్యాదులచేత పూజించి ముని పాదోదకమును తన శిరస్సున చల్లుకొన...

🌷శ్రీమహాలక్ష్మీస్తోత్రం.. వివరణ🌷

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🌷శ్రీమహాలక్ష్మీస్తోత్రం.. వివరణ🌷 నమస్తే‌உస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే | శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమో‌உస్తు తే || 1 || తాత్పర్యం: అమ్మా ! శ్రీపీఠనివాసిని ! మహామాయారూపిణీ ! దేవతలచే పూజించబడుతల్లీ ! గదాశంఖచక్రాలను ధరించినదేవీ ! మహాలక్ష్మీ ! నీకు అనేక నమస్కారములు. 🍁వివరణ: సృష్టి స్థితి లయలకు మూల కారణమైన శక్తికి "మహామాయ" అని పేరు. ఆమెయే శ్రీచక్రారూడ. సకల దేవతలు ఆమెనే పూజిస్తుంటారు. ఆమె శంఖ చక్ర గదా హస్త అయి, వైష్ణవీ రూపంతో మహాలక్ష్మిగా, విష్ణుపత్నిగా జగద్రక్షణ చేస్తుంది. లక్ష్మి అంటే సర్వాన్నీ చూచేది అని ఒక వ్యుత్పత్తి. కనుకనే సర్వాన్నీ రక్షించేదీ అయింది. విష్ణుపత్ని గనుక విష్ణువు ధరించే ఆయుధాలు లక్ష్మికీ వర్తించాయి. ఇది వైష్ణవీరూపం. ఇందలి ఐదు సంబోధనలూ అమ్మవారి పంచ ప్రకృత్యాత్మక శక్తికి సంకేతాలు. నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి | సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమో‌உస్తు తే || 2 || తాత్పర్యం: గరుత్మంతునిపై కూర్చుండి పయనించే తల్లీ ! కోలుడు అనే రాక్షసునికి భయం కల్గించిన దేవీ! సకలపాపహారిణి ! మహాలక్ష్మీ ! నీకు నమస్కారములు. 🍁వివరణ: విష్ణ...