ఓం గం గణపతయే నమః 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


ఆబాల-గోపాలం ఇష్టపడే దేవుడు గణేశుడు. పండిత, పామరజన రంజకుడు మన ‘వినాయకుడు’. ఆయన రూపం- ఆనంద దాయకం. ఆయన కథ- నవ రస భరితం.


తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్‌ 

మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్‌. 

కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై 

యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్‌.


ఓమ్ వికట రూపాయ నమః!!


సగం గజం- సగం మానవ రూపం- వికట రూపుడు!! చూడగానే ఆనందమును కలిగించే రూపం!!

ఇలా రూపాలు ధరించిన దేవతలు ఉపాసకులకు సత్వర ఫలితాలు ఇస్తారని పెద్దలు చెబుతారు.


ఓమ్ సుముఖాయ నమః !!


అతని ముఖము గజ ముఖం. గజం అంటె ఏనుగు ! తిరగ వేస్తే జగం అంటే ప్రపంచం !!

ఆయనే విశ్వం- విశ్వమే ఆయన !

గజం ఐశ్వర్య స్వరూపం!!

అందుకే లక్ష్మీ దేవికి ఇరు వైపుల అమృత ధారలు వర్షించే ఏనుగులు వుంటాయి.!!

సుముఖత్వము అంటే ప్రతి మంచి విషయం పట్ల సుముఖత వ్యక్తం చేయటం.


ఓం వక్రతుండాయ నమః!!


ఏనుగు తుండము వక్రంగా వుంటుంది!!

తుండము ‘ఓం’ కారానికి ప్రతీక.

ఎంత కఠినమైన పని అయినా ఎంత సూక్ష్మమైన పని అయినా మనం చేయగలగాలి ! ఇది ఏనుగు తుండం యొక్క విశేషం!! ఈ విషయాన్ని ఈ నామం తెలియజేస్తుంది!!


ఓం గజ కర్ణికాయ నమః!!

ఓం శూర్ప కర్ణాయ నమః !!


గజ కర్ణములు అంటే ఏనుగులాగా చాలా పెద్ద చెవులు అంటే అనేక విషయాలను పెద్దల ద్వారా వినాలి!! విని ఆకళింపు చేసుకోవాలి!! అర్థం చేసుకోవాలి!! చెవులు పెద్దగా వుంటే దీర్ఘాయుష్షును తెలియజేస్తుంది!!


శూర్ప కర్ణములు అంటే “చేటల్లాంటి” చెవులు గలవాడు!! శూర్పం అంటె చేట, చేటతో మన తల్లులు ధాన్యాన్ని చెరిగి మంచి ధాన్యం-తాలును పొట్టును వేరు చేసినట్టుగా మనం విన్న అనేక విషయాలలో మంచిని స్వీకరించి, చెడును వదలేయాలని అర్థం. పెద్ద చెవులు ఎక్కువ వినాలని, చిన్న నోరు తక్కువ తినాలి, తక్కువ మాట్లాడాలనే సందేశం ఇస్తుంది.


ఓం గజాననాయ నమః!!


గజాననుడు అంటే ఏనుగు ముఖం కలవాడు! మెల్లని చూపులు చిన్నవైన కనులు గలవాడు!! అంటే సూక్ష్మ దృష్ఠి-సూక్ష్మ బుద్దిని పెంచుకోవాలి!! నిశితమైన పరిశీలన దృష్ఠి వుండాలి!  గజానన రూపం చూస్తేనే పరమానందం!!


ఓం లంబోదరాయ నమః!!


ఆయన కొండొక గుజ్జు రూపుడు. అఖిలాండ కోటి బ్రహ్మాండాలు ఆయన కడుపు (బొజ్జ)లో వున్నాయి.

ఆయనకు ఉండ్రాళ్ళు అంటే ఇష్టం !! ఆయన పొట్టలో వున్నవన్నీ ఉండ్రాళ్లే కదా!! ఇక్కడ ఉండ్రాళ్ళు అంటే బ్పహ్మాండాలు!! అనేక కోటి బ్రహ్మాండాలను తన “ఉదరం”లో దాచుకున్న దామోదర స్వరూపమే ఆయన!!

అండ-పిండ-బ్రహ్మాండ నాయకుడు!! సమస్త విషయాలు ఆయనకు తెలుసు,ఆయనకు తెలియనిది ఏమీ లేదు!!


ఓం ఏక దంతాయ నమః!!


ఆయన ఏకదంతుడు! భగవంతుడు ఒక్కడే, నామ రూపాలు వేరైనా పరమాత్మ ఒక్కడే అని సూచిస్తుంది ఈ నామం!! !!”ఏకమేవాద్వితీయం బ్రహ్మ”!!


సకల విద్యలకు ఒజ్జ అంటే ఉపాధ్యాయుడు గురువు ఆచార్యుడు ఆయనను పట్టుకుంటే సర్వ విద్యలను, సర్వ సంపదలను ప్రసాదిస్తాడు.!!


ఆయనకు ఇద్దరు భార్యలు !!సిద్ధి!!బుద్ధి!!

ఆయనకు ఇద్దరు పుత్రులు!!

ఒకరు క్షేమం!! ఇంకొకరు లాభం!!


ప్రతి ఒక్కరికీ సిద్ధ సంకల్పం వుండాలి!! మంచి బుద్ధి వుండి ధృఢ సంకల్పముతో పనిచేస్తే ”సంకల్ప-సిద్ధి” లభిస్తుంది!! అదే మన అనంత జీవన ప్రయాణములో క్షేమంగా వెళ్లి లాభంగా రావటానికి సహకరిస్తుంది!!


ఆయన వాహనము ”ఎలుక” అంత భారీకాయానికి ఇంత చిన్న ఎలుక వాహనమా అని ఆశ్ఛర్యం కలుదుతుంది!!

ఎలుక ” మనస్సు”కు సంకేతం!! ఎలుకలాగ చంచలమైన మనసును అదుపులో పట్టుకోవాలి!! మనోఏకాగ్రత, చిత్తశుద్ధి, ఇంద్రియ నిగ్రహం కలిగివుండాలని ఈ విషయం తెలియ జేస్తుంది!!


మన దేవీ దేవతల స్వరూపాలు!!

వ్యక్తిత్వ వికాసమునకు మూల స్థంబాలు!!


ఇది స్తూలంగా గణేశ-తత్త్వం-వ్యక్తిత్వవికాసం!!


“ఓ పార్వతీ తనయా! ఓయి గణాధిప నీకు ఎల్ల వేళలా నమస్కరిస్తున్నాము !! ఓ స్వామీ మాకు సకల శుభములు ప్రసాదించు !!

-: శుభమ్ భూయాత్ :-

— బ్రహ్మశ్రీ సామర్ల వేంకటేశ్వరాచార్య!!

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు