శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము💥


ఆది శంకరులు రచించిన అద్భుతమైన స్తోత్రము శివ పంచాక్షరీ. ఇది శివుని పంచాక్షరీ మంత్రమైన నమః శివాయ లోని ప్రతి అక్షరాన్ని శివుని రూపంగా, కొన్ని లక్షణాలతో, ప్రాసలో వర్ణించబడింది. అత్యంత మహిమాన్వితమైనది.


ఓం నమః శివాయ శివాయ నమః ఓం

ఓం నమః శివాయ శివాయ నమః ఓం


నాగేంద్రహారాయ త్రిలోచనాయ

భస్మాంగరాగాయ మహేశ్వరాయ ।

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ

తస్మై "న" కారాయ నమః శివాయ ॥ 1 ॥


తాత్పర్యము:

నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.


మందాకినీ సలిల చందన చర్చితాయ

నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ ।

మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ

తస్మై "మ" కారాయ నమః శివాయ ॥ 2 ॥


తాత్పర్యము:

మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


శివాయ గౌరీ వదనాబ్జ బృంద

సూర్యాయ దక్షాధ్వర నాశకాయ ।

శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ

తస్మై "శి" కారాయ నమః శివాయ ॥ 3 ॥


తాత్పర్యము:

సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య

మునీంద్ర దేవార్చిత శేఖరాయ ।

చంద్రార్క వైశ్వానర లోచనాయ

తస్మై "వ" కారాయ నమః శివాయ ॥ 4 ॥


తాత్పర్యము:

వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.


యజ్ఞ-స్వరూపాయ జటాధరాయ [యక్ష-]

పినాక హస్తాయ సనాతనాయ ।

దివ్యాయ దేవాయ దిగంబరాయ

తస్మై "య" కారాయ నమః శివాయ ॥ 5 ॥


తాత్పర్యము:

యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.


ఫల శృతి:


పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివ సన్నిధౌ ।

శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥


తాత్పర్యము:

శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు