మాఘపురాణం - 24వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥మాఘపురాణం - 24వ అధ్యాయము

విశ్వామిత్రునికి వానరముఖము కలుగుట - గంధర్వ స్త్రీ వృత్తాంతము


మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాక దేవతలకు, గంధర్వులకు కూడ పరమ పవిత్రమైనది.


మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానము చేసాడు. అతని భార్య తానుమాత్రం స్నానము ఆచరించనని చెప్పుట వలన ఆమె దైవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక పోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గందర్వుడు ఒక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్నచోటుకు వెళ్ళి ఆయన్ని వయ్యారంగా క్రీగంట చూసింది. ఆమె అందము, యౌవ్వనము చూసిన విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించాడు. ఇద్దరూ కామక్రీడలతో తేలియాడసాగారు.


గంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు, గంధర్వస్త్రీ క్రీడిస్తూ ఉన్నారు. ఆ దృశ్యమును చూచి మండిపడుచు విశ్వామిత్రుని “నువ్వు తపస్వివైయుండి కూడా కామతృష్ణ గల వాడవైతివి గాన నీకు కోతిముఖము సంభవించుగాక అని, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు”మని భార్యను శపించి వెళ్ళిపోయాడు.


విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖముతో ఉండగా నారదుడు ఈవిషయం తెలుసుకొని విశ్వామిత్రుని వద్దకు వచ్చి “విశ్వామిత్రా! క్షణభంగురమైన తుచ్ఛ కామవాంఛకు లోనై నీ తపశ్శక్తి అంతా వదులుకున్నావు. గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలం తెచ్చి ఈ పాషాణముపై చల్లు అని నారదుడు చెప్పగా విశ్వామిత్రుడు గంగానదిలో స్నానం చేసి విష్ణువును ధ్యానించి కమండలముతో నీరు తెచ్చి పాషాణము పై చల్లాడు. ఆ పాషాణము గంధర్వ స్త్రీ రూపము ధరించి నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయింది. విశ్వామిత్రుడు తపస్సుకు వెళ్ళిపోయాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు