మాఘపురాణం - 23వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥 మాఘపురాణం - 23వ అధ్యాయము


బ్రాహ్మణ కన్యల విమోచనము


కొంతకాలం క్రిందట మగధరాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులు ఉండేవారు. వారి నలుగురికి నిండు యవ్వనవతులైన నలుగురు కుమార్తెలు ఉన్నారు. కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకు ఒక గురుకుల విద్యార్ధి వచ్చాడు. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందము చూచి మోహించి అతనిని సమీపించి తమను వివాహము చేసుకోమని బలవంతము చేసారూ. ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోర్కె నిరాకరించెను.


ఆ కన్యలు కోపంతో “నీవు పిశాచివి కమ్మని” శపించారు. “మీరుకూడా పిశాచులగుదురు గాక” అని విద్యార్ది ప్రతిశాపము ఇచ్చాడు. వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుతు ఉండేవారు.


కొంత కాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచముల తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచ రూపములు ఎలా పోతాయని అడిగారు.


ఆ సిద్ధుడు “వీరందరి చేత మాఘమాసంలో గయలో ఉన్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచరూపములు తొలగి పోతాయి” అని చెప్పాడు. అలా చేయటము చేత ఆ నలుగురికి యధారూపములు కలిగాయి. అలా జరుగుటకు మాఘస్నానము కారణము.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు