మాఘపురాణం - 22వ అధ్యాయము
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🌹
💥 మాఘపురాణం - 22వ అధ్యాయము
గంగాజల మహత్యము
దత్తాత్రేయుడు శివపూజ గురించి, శివమహత్యమును గురించి వివరిస్తాను అని ఇంకా ఈ విధముగా చెప్పసాగాడు.
శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టినచోట శివలింగమును ప్రతిష్ఠించి, శివుని ధ్యానించి, వారధిని దాటి రావణుని చంపాడు. హనుమంతుడు సముద్రమును దాటునపుడు శివుని ధ్యానించి, రామునికి నమస్కరించి, మహాబలమును సంపాదించి సముద్రమును దాటాడు. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరేముందు శివపూజ చేసి యుద్దరంగంలో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొన్నారు. స్త్రీలు తమ మనోవాంఛను తీర్చుకొన్నారు. పూజలందు శివపూజ పవిత్రమైనది.
విష్ణు పాదములనుండి పుట్టిన గంగ పరమపవిత్రమై శివుని శిరస్సునుండి ప్రవహించుట వలన సర్వపాపరహితమైనది. గంగాజలములలో స్నానము చేసిన మహాపాపములు సైతం హరించిపోతాయి. గంగాజలమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది.
ఏనదిలో గాని, సెలయేరులో గాని, చెరువునందు గాని స్నానం చేయునపుడు ‘గంగ గంగ గంగ!’ అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొన్నఅది గంగాజలంతో సమానము అవుతుంది. గంగ విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటియగు జలము ఈ ప్రపంచమునందు ఎక్కడా లేదని గంగా జలమును గురించి కార్తవీర్యార్జునునకు వివరించాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment