మాఘపురాణం - 19వ అధ్యాయము

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏


💥మాఘపురాణం - 19వ అధ్యాయము


ఏకాదశీ మహత్యము


సంవత్సరములో వచ్చు 12 మాసములలోను మాఘమాసం అతి ప్రశస్తమైనది. అటువంటి మాఘమాసంలో నదిలో గాని, నదిలేని చోట తటాకమందు గాని, తటాకం కూడా అందుబాటులో లేనియెడల నూతి దగ్గర గాని, స్నానం చేసినంత మాత్రముననే మానవునకు చేసిన పాపములన్నియు హరించిపోతాయి.


పూర్వం అనంతుడు విప్రుడు యమునా నదీతీరమునందున్న అగ్రహారంలో నివసిస్తు ఉండేవాడు. అతని పూర్వీకులు గొప్ప జ్ఞానవంతులు, తపశ్శాలురు, దానధర్మములు చేసి కీర్తిపొందిన వారు.


అతడు చిన్నతనం నుంచి గడసరి, పెంకివాడు. తల్లిదండ్రుల భయభక్తుల వలన కొంతవరకు మాత్రమే విద్య నేర్చుకొన్నాడు. దుష్ట సహవాసములు చేసి అనేక దుర్గుణములు కలవాడయ్యాడు. మద్య మాంసములు సేవించి కన్నబిడ్డలను కూడా అమ్ముకుంటూ సంపాదించి ధనవంతుడయ్యాడు. కొంతకాలమునకు వృద్ధుడు అయ్యాడు. తనకు ఉన్న ధనంతో తాను తినడు, ఇతరులకు పెట్టడు. ఒకనాటి రాత్రి పడుకునే సమయములో “అయ్యో! నేనెంతటి పాపాత్ముడను ! శరీరబలం ఉన్నదను మనోగర్వంతో జీవితాంతము ముక్తిని ఇచ్చే పుణ్యకార్యము ఒక్కటి చేయలేదని ఆలోచిస్తూ పశ్చాత్తాపము చెందుతూ నిద్రపోయాడు. ఒకేవిధముగా అన్ని రోజులు ఉండవు. ఆరోజు రాత్రి కొందరు చోరులు అనంతుని ఇంటిలో ప్రవేశించి ధనం, బంగారం, ఎత్తుకు పోయారు. అనంతుడు నిద్రనుండి లేచి చూడగా సంపదంతా అపహరింపబడింది. అన్యాయంగా ఆర్జించిన దానం అన్యాక్రాంతము అయ్యెనని రోదన చేసాడు. ఆ సమయమున పెద్దల చెప్పిన నీతులు జ్ఞప్తికి వచ్చి తాను చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కోరుకున్నాడు. ఆ సమయములో మాఘమాసము నడుచుచున్నందున యమునా నదికి వెళ్ళి స్నానము చేసాడు. అందువలన అతనికి మాఘమాస స్నాన ఫలం దక్కెను. నదిలో మునిగి తడి బట్టలతో ఒడ్డుకు చేరి, చలికి గడగడ వణికి బిర్రబిగిసిపోయాడు. “నారాయణ” అంటూ ప్రాణములు విడిచిపెట్టాడు. ఆ ఒక్క రోజు నదిలో స్నానం చేయుట వలన తాను చేసిన పాపములన్నీ నశించిపోయి వైకుంఠవాసుడయ్యాడ” ని వశిష్ఠుడు తెలియచేసాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు