Posts

Showing posts from October, 2025

💥శివపంచాక్షరీ మంత్రం.. మానసిక ప్రశాంతతకు మూలం!

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥శివపంచాక్షరీ మంత్రం.. మానసిక ప్రశాంతతకు మూలం! "ఓం నమఃశివాయ" ఇదే పంచాక్షరీ మహా మంత్రం. ఈ మంత్రం యజుర్వేదం రుద్రాధ్యాయం లోనిది. అన్ని కోర్కెలనూ నెరవేర్చే కల్పవృక్షం ఈ మంత్రం. దీని ఉచ్చరణ వల్ల చిత్తశుద్ధి, జ్ఞానప్రాప్తి లభిస్తాయని పురాణాల్లో తెలిపారు. ఈ మంత్రంలో ‘ఓం’తో సహా ఆరు అక్షరాలున్నాయి. ప్రతి మంత్రానికి ముందు ఓం ఉంటుంది. కాబట్టి, దాన్ని వదిలేసి లెక్కిస్తే ఐదక్షరాలే. అలా అని ఓంకారాన్ని వదలరాదు. ‘న, మ, శి, వ, య. మంత్రం’ ‘ఓం’ కారంతో ప్రారంభం అవుతుంది. ఓం... మహాబీజాక్షరం. దీని నుంచే మిగిలిన అక్షరాలన్నీ ఆవిర్భవించాయని చెబుతారు. ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు ‘అర్థం, పరమార్థం’ రెండూ ఉన్నాయి. ‘న’ అనేది భగవంతునిvలోని కాంతిని తెలియచేస్తున్నా ఈ పంచాక్షరాలను "పంచభూతాలు" అని కూడా అంటారు. న అంటే భూమి, మ అంటే నీరు, శి అంటే నిప్పు, వ అంటే గాలి, య అంటే ఆకాశం అని ఈ మంత్రంలో ఉన్న అక్షరాలకు నిర్వచనం చెప్పారు. ఈ మంత్రం ఆధ్యాత్మికతకు ఉపయోగపడుతుందని, ఈ మంత్రోచ్చారణ వల్ల నాడులు పరిశుభ్రమై, మనసులో ప్రశాంతత నెలకుంటుందని పండితులు చెబుతారు. దీనిని పదేపదే ఉచ్చరించడం ...

⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం l మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం ll "ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః" -అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, దానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది. వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసా దించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు. యోగ్యత, అయోగ్యలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగ వానుడు. సృష్టి స్థితి లయలు సూర్యుని ప్రమేయంతోనే జరుగుతున్నాయని.. (సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/ సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ) ‘సూర్యోపనిషత్తు’ పేర్కొంది. ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్‌ కుర్వన్‌ బ్రహ్మణో విద్వాన్‌ సకలం భద్రమశ్నుతే’- ‘ఉదయిస్తున్న, అస్తమిస్తున్న సూర్యుణ్ని ఎవరు ధ్యానిస్తున్నారో, వారికి అన్ని శుభాలూ కలుగుతాయి’ అని శ్లోక భావం. 'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అని సూక్తి. అంటే సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం కూడా సూర్య భగవానుడే అని అర్థం. సూర్యభగవానుడి...

💥గోవింద నామ మహిమ..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 శరణాగతవత్సల గోవిందా కరుణాసాగర గోవిందా! గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా!! 💥గోవింద నామ మహిమ.. 'గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేలనామాలు ఉన్నాయి.  ‘నారాయణ’ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా, శరణు కోరేవారికి కొండంత అండగా, భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైన విష్ణునామం ‘గోవింద’ మాత్రమే. 💥మూడక్షరాల గోవిందనామం చేతనే ఏకంగా మోక్షాన్ని పొందిన '#క్షత్రబంధువు’ అనే  ఆయన కథ ఆసక్తికరం. సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే ‘క్షత్రబంధువు’గా ప్రసిద్ధి పొందాడు. ఇతడు బాల్యం నుంచే హింసా ప్రవృత్తిని కలిగి మూగజీవాలను, చిన్నపిల్లలను చంపేవాడు. దీంతో ఇతణ్ణి మహారాజు ‘రాజ్య బహిష్కారం’ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపాడు. అక్కడకూడా ‘క్షత్రబంధువు’ మహర్షులను హింసిస్తూ, జంతువులను వధిస్తూ ఆఖరికి నరమాంసాన్నీ తినేవాడు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఓ సరస్సులోకి దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు. క్షత్రబంధువు దూరం నుంచే...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు.  వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరకలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు.  అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్ర...

⚜️🕉️🚩 ఓం దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం దక్షిణామూర్తయే నమః🌹🙏 వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్! త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి!! తాత్పర్యము: సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించబడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.  "రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్" -ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు.. అని శ్వేతాశ్వతరోపనిషత్తు దక్షిణామూర్తిని ప్రార్థించింది. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణామ్! నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః!! దక్షిణామూర్తి సకల జగద్గురు మూర్తి కనుక - స్వామి ఆరాధన సకల విద్యలను ప్రసాదిస్తుంది. ఐహికంగా - బుద్ధి శక్తిని వృద్ధి చేసి విద్యలను ఆనుగ్రహించే ఈ స్వామి పారమార్థికంగా తత్త్వ జ్ఞానాన్ని ప్రసాదించే దైవం. దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి మకర కుండలం ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశక...

⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 శ్రీమహావిష్ణువు ఇరవై ఒక్క అవతారాల్లో దత్తావతారం ఆరోదని భాగవత పురాణం చెబుతోంది. దత్తరూపం అసామాన్యమైంది. త్రిమూర్తుల లక్షణాలు, త్రిమూర్తుల తత్త్వాలు మూర్తీభవించి, ఆవిర్భవించినదే దత్తావతారం. మార్గశిర శుద్ధ పూర్ణిమనాడు అత్రి, అనసూయ దంపతులకు త్రిమూర్తుల వరప్రభావం వల్ల దత్తుడు జన్మించాడు. ‘దత్తం’ అంటే ఇచ్చినవాడని. అత్రి కుమారుడు కావడంతో ఆత్రేయుడైనాడు. దత్తాత్రేయుడు ఉపనయనం అయిన వెంటనే అరణ్యానికి వెళ్లి తపస్సు ద్వారా పరిపూర్ణమైన జ్ఞాన సముపార్జన చేశాడు. ఇరవై నలుగురిని తన గురువులుగా భావించి, సేవించాడు. కార్తవీర్యుడు, పరశురాముడు, యదువు, అలర్కుడు, ప్రహ్లాదుడు వంటి పలువురు లోకప్రసిద్ధులకు ఆధ్యాత్మిక విద్య బోధించాడు. అవధూత గీత, జీవన్ముక్త గీత, అవధూతోపనిషత్తు మొదలైన గ్రంథాలు రచించాడు.  దత్తుడు గొప్ప అవధూత. మహాజ్ఞాని. చిరంజీవి. యుగయుగాలకు ఆయన ఆదర్శమూర్తి. లోకగురువైనాడు. ప్రాపంచిక విషయాలను వదిలి ఏకాంతవాసం చేశాడు. జాతి శ్రేయస్సుకోసం జ్ఞానబోధ చేశాడు. దత్తాత్రేయుడు ఆదిగురువైన పరబ్రహ్మ స్వరూపుడు. శిష్యకోటి హృదయాల్లో అఖండ జ్ఞానదీపం వెలిగించిన వైరాగ్యరూప విలక్షణమూర్త...