⚜️🕉️🚩ఓం శ్రీ గురువాయూరప్పనే నమః🌹🙏
⚜️🕉️🚩ఓం శ్రీ గురువాయూరప్పనే నమః🌹🙏 💥గురువాయూరప్పన్💥 నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడు రూపం.."గురువాయూరప్పన్" పవిత్రమైన విష్ణుక్షేత్రం.. దక్షిణ ద్వారకగా పిలవబడే.. కేరళ లోని "గురువాయూరు"లో.. స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారు. శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి. 💥#పురాణగాధ: ఐదువేల సంవత్సరాల క్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని వెుదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ.. ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్...