శ్రీ సూర్యం ప్రణమామ్యహం
శ్రీ సూర్యం ప్రణమామ్యహం🙏 ఆదిత్యుడు ప్రతిరోజూ ఉదయిస్తాడు. లోకయాత్ర సాగిస్తాడు. జగత్తుకు వెలుగును ప్రసాదిస్తూ, సమస్త జీవరాశినీ కర్మలకు ప్రేరేపిస్తూ, తాను సాక్షిగా ఉన్నాడు. అందుకే ఆయన ‘ కర్మసాక్షి ’ జగత్తుకే నేత్రంగా ఉండడం వల్ల ఆయన జగచ్ఛక్షువు . లోక బాంధవుడు... ప్రత్యక్ష దైవం ... సమయపాలనా చక్రవర్తి... ఆరోగ్యదాత... అభయప్రదాత. సృష్టికి పూర్వం నుంచీ ఉండడం వల్ల ఆదిదేవుడు . ఏకో అశ్వో సప్తమాన ’ సూర్యుని రథాశ్వం ఒక్కటే.. అదే ‘సప్త’ ‘సప్త’ అనేది సూర్య రథానికి పేరు. అదే అశ్వం. అంతే కాని ఏడు అశ్వాలు లేవన్నది ఒక అభిప్రాయం. ఆ సప్తకు ఒకే చక్రం. అది సంవత్సరానికి సంకేతం. ఆ చక్రానికి ఉన్న ఆరు ఆకులు... ఆరు ఋతువులకు చిహ్నాలు. సూర్యుని కిరణాలలోంచీ ప్రధానంగా ఏడు కిరణాలు వెలువడతాయి. అవి... సుషుమ్నం, హరికేశం, విశ్వవ్యచ, సంపద్వసు, అర్వాస్యం, విశ్వస్రవ, సర్వాద్వసు. అసేవా ఆదిత్య ఏషోశ్వః ఆదిత్యుడే అశ్వమనీ, ఆదిత్య మండలమే రథమనీ భావం. బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరః సాయం ధ్యాయే మహా విష్ణుం, త్రయీ మూర్త దివాకరః సూర్యభగవానుడు ఉదయం బ్రహ్మస్వరూపం గా, ప్రకృత...