Posts

Showing posts from April, 2026

💥శ్రీవేంకటేశ్వర మంగళాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 "శ్రీ వేంకటేశ్వర మంగళాష్టకం" అనేది తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్య రూపం, గుణాలను కీర్తిస్తూ, ఆయనకు మంగళం కలగాలని ప్రార్థించే ఎనిమిది శ్లోకాల స్తోత్రం. ఇది స్వామివారి అనుగ్రహం, శాంతి మరియు ఐశ్వర్యం కోసం భక్తులు ప్రతిరోజూ పఠించే ముఖ్యమైన స్తోత్రం.  💥 శ్రీవేంకటేశ్వర మంగళాష్టకం 💥 శ్రీక్షోణ్యౌ రమణీయుగం సురమణీపుత్రోఽపి వాణీపతిః పౌత్రశ్చంద్రశిరోమణిః ఫణిపతిః శయ్యా సురాః సేవకాః । తార్క్ష్యో యస్య రథో మహశ్చ భవనం బ్రహ్మాండమాద్యః పుమాన్ శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 1 ॥ యత్తేజో రవికోటికోటికిరణాన్ ధిక్కృత్య జేజీయతే యస్య శ్రీవదనాంబుజస్య సుషమా రాకేందుకోటీరపి । సౌందర్యం చ మనోభవానపి బహూన్ కాంతిశ్చ కాదంబినీం శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 2 ॥ నానారత్న కిరీటకుండలముఖైర్భూషాగణైర్భూషితః శ్రీమత్కౌస్తుభరత్న భవ్యహృదయః శ్రీవత్ససల్లాంఛనః । విద్యుద్వర్ణసువర్ణవస్త్రరుచిరో యః శంఖచక్రాదిభిః శ్రీమద్వేంకటభూధరేంద్రరమణః కుర్యాద్ధరిర్మంగళమ్ ॥ 3 ॥ యత్ఫాలే మృగనాభిచారుతిలకో నేత్రేఽబ్జపత్రాయతే కస్తూరీఘనసారకేసరమిలచ్ఛ్రీగంధసారో ద్రవైః । గంధైర్...

💥మహాలక్ష్మీ స్తోత్రం (ఇంద్రరచితం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥దుర్వాస మహర్షి శాపం వల్ల కోల్పోయిన సంపదను తిరిగి పొందడానికి ఇంద్రుడు శ్రీమహావిష్ణువు సూచన మేరకు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి రచించిన అత్యంత శక్తివంతమైన స్తుతి. బ్రహ్మవైవర్త పురాణం మరియు దేవీ భాగవతంలో ఉన్న ఈ స్తోత్రాన్ని భక్తితో పఠిస్తే అష్టైశ్వర్యాలు, రాజ్యలక్ష్మి సిద్ధిస్తాయని నమ్మకం. ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మీ మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో జన్మల నుంచీ అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగి ఆఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది. శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇది ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం. 💥మహాలక్ష్మీ స్తోత్రం (ఇంద్రరచితం) నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః | కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః || పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః | హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః | చంద...

💥చైత్ర శుద్ధ పౌర్ణమి.. శ్రీ హనుమద్విజయోత్సవం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥చైత్ర శుద్ధ పౌర్ణమి.. శ్రీ హనుమద్విజయోత్సవం💥 శ్రీరామదూత అయిన హనుమంతుడు అమేయ బలసంపన్నుడు. ఆయన నామ స్మరణతో భయాందోళనలు తొలగిపోతాయని, భూతప్రేతాదులు పారిపోతాయనీ ప్రతీతి. భక్తుల పాలిట కల్పవృక్షమైన ఆంజనేయుడు బలం, భక్తి, వినయం, విధేయతలకు ప్రతిరూపం. చైత్ర పౌర్ణమినాడు విజయప్రదాత అయిన హనుమద్విజయోత్సవాన్ని నిర్వహిస్తారు.  రావణ సంహారం అనే లక్ష్యం దిశగా రామాయణ గాథ నడవడంలో ప్రధాన పాత్ర హనుమంతుడిదే. అందుకే... గోష్పదీకృత వారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం... అన్నారు.  ‘‘సముద్రాన్ని గోవు పాదంలా భావించి దాటినవాడు, రాక్షసులను దోమల్లా పరిగణించి మట్టుపెట్టినవాడు, ‘రామాయణం’ అనే మాలలో రత్నంగా భాసిల్లినవాడు అయిన వాయుపుత్రుడికి నమస్కారాలు’’ అని దీని భావం. ఉత్తర భారతదేశ ప్రజలు హనుమజ్జయంతిని చైత్ర పౌర్ణమి నాడు జరుపుకొంటారు. తమిళనాడులో మార్గశిర అమావాస్య నాడు, ఒడిశాలో మేష సంక్రాంతి రోజున నిర్వహిస్తారు. తెలుగు ప్రాంతాల్లో చైత్ర పౌర్ణమిని హనుమద్విజయోత్సవంగా, వైశాఖ బహుళ దశమిని హనుమజ్జయంతిగా జరుపుకొనే ఆనవాయితీ కనిపిస్తుంది. వైశాఖ మాసం కృష్ణపక్షంలోని ద...

💥శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏 శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం, హిరణ్యకశిపుడిని సంహరించడానికి స్తంభం నుండి నరసింహ స్వామి అవతరించిన ఘట్టాన్ని వర్ణిస్తుంది. ఇది వేయి సూర్యుల కాంతితో ప్రకాశించే, అత్యంత భయంకరమైన ఉగ్రరూపాన్ని భజిస్తూ, శత్రు భయం, గ్రహ దోషాలు, దుఃఖం నుండి రక్షణ పొందేందుకు పఠించే శక్తివంతమైన స్తోత్రం.  ధ్యానమ్: గోఖండం వారమాండం పరివిరి విరటం। దర్పణాండం పరాండం || దింభిం దింభిం కుటిమ్భిం పచడుహమాం కప్రజం, పప్రజం పం | త్రయ్యా స్త్రిస్త్రయ్యా కుకుకుకుకుకుకుః కుమాంకం। కుమాంకుం | ఏతత్తే గహతు గహతుమాం। నారసింహో నృసింహః ||  💥శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం💥 సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం ప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ | అజస్తృజాండకర్పరప్రభగ్నరౌద్రగర్జనం ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || 1 || స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమం ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ | అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్ యుగాంతిమాంతమత్కృతాంతధిక్కృతాంతకం భజే || 2 || జగజ్వలద్దహద్గ్రసత్ప్రహస్ఫురన్ముఖార్భటిం మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృతాకృతిమ్...

నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం..

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥నవగ్రహాల అనుగ్రహాన్ని కలిగించే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.. శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలని పూజించిన ఫలితం వస్తుందని "పరాశర సంహిత"లో ఉంది. నవగ్రహాల అనుగ్రహం త్వరగా పొందాలంటే వాల్మీకి రామాయణం లోని ఈ 9 శ్లోకాలు నిత్యం పారాయణ చేయడం మంచిది. నవగ్రహాలు అత్యంత కరుణా స్వరూపులు. మనం పూర్వజన్మలలో చేసిన పుణ్యపాపాల బట్టి ఫలితాలని ఇస్తారు.  కానీ భక్తితో వారిని ఇటువంటి స్తోత్రాలతో స్తుతిస్తే శుభఫలితాల్ని అనుగ్రహిస్తారు.  శ్రీ ఆంజనేయ నవరత్నమాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం, సత్సంతానము మరియు వృద్దులకు ఆరోగ్యం కలుగుతుంది. నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభఫలితాలని పొందవచ్చు. వాల్మీకి రామాయణమునకు సుందరకాండ తలమానికము. సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం.  రత్నముల వంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీ ఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది. ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.  ఇవి శ్...

ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 ఆకాశ శ్చికురాయతే దశదిశాభోగో దుకూలాయతే – శీతాంశుః ప్రసవాయతే స్థిరతరానందః స్వరూపాయతే | వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్‌ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి|| సాంబమూర్తి ఎవరు? ఆయన దే వూరు? స్వరూపమేమి? ఆయన కేశకలాప మెట్లా వుంటుంది? ఆయన వేష భాష లేవి? ఎవరినైనా మనం స్తోత్రించాలంటే, అతని స్వరూప స్వభావాలు తెలిస్తే కదా స్తోత్రం చేయగలం? సాంబమూర్తిని ఏవిధంగా గుర్తించగలం? అన్న ప్రశ్నకు జవాబుగా ఆచార్యులవారు దశశ్లోకి అనే స్తుతిలో సాంబపరబ్రహ్మను స్తోత్రం చేశారు. సాంబమూర్తి ఏవిధంగా ఉంటాడు? ఆయనకు శిఖ ఉన్నదా? లేక వ్యుప్తకేశుడా? ‘ఆకాశ శ్చికురాయతే‘ శివాష్టోత్తర నామావళిలో ‘వ్యోమకేశాయ నమః‘ అని ఒక నామమున్నది. వ్యోమ మనగా ఆకాశము చికురములు అనగా కేశములు. ఆకాశమే ఆయన చికురములు. (జటాజూటము) ఆయన ధరించిన వస్త్ర మెలాఉన్నది. తెల్లనిదా? ఎఱ్ఱనిదా? వానిలో జరిగ ఉన్నదా? ‘దశదిశా భోగో దుకూలాయతే’ పది దిక్కులే ఆయనకు వస్త్రం. తూర్పు పడమర, ఉత్తరం దక్షిణం, ఆగ్నేయం వాయవ్యం, నైరుతి ఈశాన్యం- ఊర్ధ్వం అథోభాగం అనే పదిదిక్కులే ఆయన ధరించిన దువ్వలువ. ‘శీతాంశుః ప్రసవాయతే‘- చల్లని కిరణములుగల చంద...

శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏 ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్  లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను. 💥శ్రీరామ నామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. 🌹శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై, గజేంద్రుడికీ, అహల్యకూ, ద్రౌపదికీ కష్టాలు పోగొట్టిన చుట్టమై అలరారి, పాపాత్ములను పాప విముక్తులను చేసే గొప్ప మహిమాన్విత మంత్రం- రామ నామమని, ఆ రామ నామం తన నాలుకపై నటింప జేయుమని భక్త రామదాసు శ్రీరామచంద్రున్ని కోరుతూ ఆ రామ నామ మహిమ వైభవాన్ని ఎంతో మహనీయంగా కొనియాడాడు. శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!! "శ్రీమన్నారాయణ స్వరూపుడు, అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాస మహర్షి తన ఆధ్యాత్మ రామాయణంలో  మనసారా శ్రీరామ నామాన్ని...

శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 శ్రీ వేంకటేశ్వరుడు కలియుగ దైవంగా, ఏడుకొండల స్వామిగా, అనాధ నాధుడుగా, ఆర్త జన దీక్షాదక్షుడుగా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడుగా, శ్రీనివాసుడుగా అన్నింటికీమించి గోవిందుడుగా కొనియాడబడుచూ కొలువబడుతున్నాడు. పద్మావతీదేవి, అలివేలుమంగ పతిగా, సప్తగిరీశుడుగా, తిరుమలేశుడుగా భక్తకోటికి దర్శనమిస్తూ అనుగ్రహిస్తున్నాడు. వేంకటాద్రికి సరితూగే స్థానంగాని వేంకటేశ్వరుడికి సమాన దైవంగాని లేరని శాస్త్ర కథనం.  భృగుమహర్షి కారణంగా శ్రీమన్నారాయణుడు భువికి రావడం శ్రీనివాసుడుగా వేంకటాద్రిపై అవతరించడం- ఇదంతా విష్ణు లీలా విశేషమని మహర్షుల మాట. శ్రవణం నక్షత్రంనాడు, మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడుగా అవతరించాడు. కావున ప్రతీ శ్రవణ నక్షత్రం నాడు ఉభయ దేవేరులతో కూడియున్న మలయప్పస్వామి వారు తిరువీధుల్లో బంగారు రథంపై విహరిస్తూ భక్తులను తరింపజేస్తారు. స్వామివారి పుష్కరిణిలో స్నానం, శ్రీ వరాహస్వామి దర్శనం, కటాహతీర్థపానం- ఈ మూడూ ముల్లోకాలలో దుర్లభాలని స్కాందపురాణం తెలుపుతోంది ‘వినా వేంకటేశం, ననాదో ననాథః సదా వెంకటేశం స్మరామి స్మరామి’- స్వామీ నీవే మాకు దిక్కు తప్ప మరో దిక్కు లేదు. నిన్నే నిరంతరం...