అరుణాచల శివ అరుణాచల శివ
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ శ్లో: "దర్శనాత్ అబ్రసదసి జననాత్ కమలాలయే స్మరణాత్ అరుణాచలే కాశ్యాంతు మరణాన్ ముక్తిః " భావం : చిదంబరం లో శివదర్శనం, తిరువాయూర్ లో జననం, అరుణాచలేశ్వరుని స్మరణం, లేదా కాశీలో మరణం ముక్తి కారకములు. కాశీలో మరణించిన వారికి ముక్తిని ప్రసాదిస్తానని తాను చేసిన ప్రతిజ్ఞని పరమేశ్వరుడు ఎలా నెరవేర్చుకుంటాడో శ్రీనాధ కవిసార్వభౌముడు కాశీఖండంలో తెలియచేసిన పద్యం: పద్యం: పాలిండ్లు కదలంగా పసిడి పైయెద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ, ధుఃకారమొనరించు తొండంబు ముక్కున శిఖరారావము జిలుకు డుంఠి, ప్రత్యక్షమైవచ్చి భాగీరధీ గంగ మృదుల హస్తంబు చాచి మేను నిమురు, ప్రధమోత్తముండు భృంగి భయరక్షణార్ధంబు ఫాలాగ్రమున దీర్చు భసిత రేఖ, దక్షిణ శృతి మీదుగా ధాత్రి త్రెళ్లి, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ, పంచజనులకు తారక బ్రహ్మవిద్య అభవుడుపదేశమొనరించు కాశి! భావం : ఊపిరి అందక మరణావస్థలో ఉన్న జీవుడు ప్రాణోత్క్ర్కమణం అవుతున్నవేళ: 1. చక్కటి సువాసనలు వెదచల్లుతూ, గాజుల, కాలియందెల చప్పుడు వినిపిస్తుండగా పర్వత రాజపుత్రి అయిన పార్వతి దేవ...